Breaking News

01/04/2019

బీజేపీవైపు హరీష్ రావు చూస్తున్నారా..?

హైదరాబాద్ ఏప్రిల్ 1 (way2newstv.in)
ప్రస్తుతము రాష్ట్రములో ఒకవైపు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండగా మరోవైపు టిఆర్ఎస్ లో కీలక నేత హరీష్ రావు గురించి ఏదో ఒక చోట చర్చ జరుగుతునే ఉంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్ తర్వాత అంతటి సీనియర్ నాయకుడు - ఆయన మేనల్లుడు అయిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు భారతీయ జనతా పార్టీలో చేరడానికి చూస్తున్నారని సోమవారం  ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో కథనం రావడం చర్చనీయాంశంగా మారింది. అందులో సంచలన విషయాలను రాసుకొచ్చారు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బీజేపీ నాయకత్వం హరీష్ రావును సంప్రదించిందని.. తర్వాతి ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని.. బీజేపీలో చేరాలని ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం.తెలంగాణలో బీజేపీకి సరైన నాయకుడు లేకుండా పోయారు. మొన్నటి ఎన్నికల్లో ఉద్దండులైన బీజేపీ నేతలు లక్ష్మన్ కిషన్ రెడ్డిలు సైతం ఓడిపోయారు. 


బీజేపీవైపు హరీష్ రావు చూస్తున్నారా..?  

ఈ నేపథ్యంలో హరీష్ రావు కంటే మెరుగైన నాయకుడు లేడని భావించిన బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు సదురు ఆంగ్ల జాతీయ పత్రిక రాసుకొచ్చింది.ఇక హరీష్ రావు సైతం టీఆర్ఎస్ లో తన ప్రాధాన్యతను తగ్గిస్తున్న దృష్ట్యానే తన బలాన్ని ప్రదర్శించడానికి ఒకవేదికను కోరుకుంటున్నట్టు పత్రిక అభిప్రాయపడింది. ప్రస్తుతం టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ పార్టీ బాధ్యతలను తన కుమారుడు కేటీఆర్ కు అప్పగించడంతో మొత్తం అధికారాలన్నీ ఆయనకే పోయాయి. దీంతో తనకు టీఆర్ఎస్ లో ఎలాంటి భవిష్యత్ లేదని హరీష్ గ్రహించినట్టు పత్రిక రాసుకొచ్చింది. ఇక ఇటీవల జరిగినే తొలి కేబినెట్ విస్తరణలోనూ హరీష్ రావును కేసీఆర్ పట్టించుకోకపోవడం.. పూర్తిగా పక్కనపెట్టడంతో హరీష్ రావు కూడా బీజేపీ ఆఫర్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయినప్పటికీ ప్రస్తుతం హరీష్ లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు వేచిచూద్దామనే ఆలోచనలోనే ఉన్నాడట.. ఒక మళ్లీ నరేంద్రమోడీ అధికారంలోకి వస్తే బీజేపీలోకి వెళదామని.. లేకుంటే టీఆర్ఎస్ లోనే కొనసాగుదామని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అయితే వాస్తవానికి హరీష్ కు టీఆర్ఎస్ లో ప్రాధాన్యం తగ్గగానే ఆయన అలక వహించాడని తెలుసుకొని కేసీఆర్ పిలిపించి మాట్లాడినట్టు తెలిసింది. దీంతో హరీష్ రావు అప్పటి నుంచి సైలెంట్ గా టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే హరీష్ రావు నిజంగా కేసీఆర్ పై తిరుగుబాటు చేసి రాబోయే రోజుల్లో బీజేపీకి  మారుతారా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.  అయితే యథాలాపంగానే ఈ కథనం ఏప్రిల్ 1న ప్రచురితం కావడంతో జనాలను ఏప్రిల్ ఫూల్ చేయడానికే అని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. రైటర్ కూడా ఏప్రిల్ ఫూల్స్ దృష్టిలో పెట్టుకొనే రాశాడని అంటున్నారు. కానీ రాజకీయ అవసరాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు..హరీష్ గమనం అనేది ఎటు తిరుగుందో వేచి చూడాలి మరి..

No comments:

Post a Comment