Breaking News

01/04/2019

ఎన్నికల్లో మోడి, కేసియార్ కలిసి డ్రామాలాడుతున్నారు : రాహుల్

జహీరాబాద్, ఏప్రిల్ 1, (way2newstv.in)
ఎన్నికల్లో మోదీ, కేసీఆర్ కలిసి డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. తెరాస ప్రభుత్వం రిమోట్ మోదీ చేతిలో ఉందని ఆరోపించారు. భాజపాతో నిజంగా పోరాడుతోంది కాంగ్రెస్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్రాలపై విమర్శలు గుప్పించారు.
దేశానికి కాదు.. దొంగలకు చౌకీదార్దేశంలోని దొంగలకు ప్రధాని మోదీ చౌకీదార్గా ఉన్నారు. అనిల్ అంబానీ, నీరవ్మోదీ, మోహుల్ చోక్సీలకు మోదీ చౌకీదార్గా ఉన్నారు. ఆర్థిక నేరగాళ్లను దేశం దాటించారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తామని మోదీ అబద్ధం చెప్పారు. 


ఎన్నికల్లో మోడి,  కేసియార్ కలిసి డ్రామాలాడుతున్నారు : రాహుల్

పేదవాళ్లపై సర్జికల్ స్ట్రైక్ చేశారు. యువతకు ఏటా 2 కోట్ల ఉపాధి అవకాశాలు కల్పిస్తానని మోసం చేశారు. పేదలు, రైతులకు కాంగ్రెస్ మాత్రమే న్యాయం చేస్తుంది. మేం అధికారంలోకి రాగానే పేదరికంపై మెరుపుదాడులు చేస్తాం. ప్రతి పేదవాడి ఖాతాలో రూ.72వేలు వేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.
మోదీ, కేసీఆర్వి డ్రామాలునల్లకుబేరులపై చర్యలు తీసుకుంటామని మోదీ అన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామన్నారు. రాత్రికి రాత్రే రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేశారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం వెనక్కి రాలేదు. దీనికి తోడు గబ్బర్ సింగ్ ట్యాక్స్ తీసుకొచ్చారు. దీంతో పేదలు, మధ్యతరగతి, చిరు వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. నోట్లరద్దు, జీఎస్టీకి ఇక్కడి సీఎం కేసీఆర్ మద్దతు పలికారు. తెరాస ప్రభుత్వ రిమోట్ మోదీ చేతిలో ఉంది. అందుకే ఆయన చెప్పినట్లు ఆడుతున్నారు. రఫేల్ కుంభకోణంపై కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని రాహుల్ ప్రశ్నించారు.

No comments:

Post a Comment