Breaking News

01/04/2019

నా ఓటు యాప్ డౌన్ లోడ్ చేసుకోండి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ క్రిష్ణ భాస్కర్
సిద్ధిపేట, ఏప్రిల్ 01: (way2newstv.in)
భారత ఎన్నికల సంఘం ఓటర్ల సౌలభ్యం కోసం తీసుకొచ్చిన బహుళ ఉపయోగాలు ఉన్న నా ఓటు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ కోరారు. ఈ యాప్ సంబంధించిన వివరాలను ఆదివారం ఆయన వెల్లడించారు. ఓటరు వివరాలు, ఎన్నికల షెడ్యూల్, దివ్యాంగ ఓటర్లకు ఇంటి నుంచి పోలింగ్ కేంద్రాల వరకూ పికల్ సదుపాయం వంటి వాటికి ఈ యాప్ ఉపయోగపడుతుందని సూచించారు. 


నా ఓటు యాప్ డౌన్ లోడ్ చేసుకోండి 

పోలింగ్ కేంద్రాల రూట్ మ్యాపు, ఆన్ లైనులో ఓటరు నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులు వంటి సేవలు అసెంబ్లీ నియోజకవర్గం వారీగా సమాచారం, బీఎల్ఓ-బూత్ లెవల్ ఆఫీసర్ల సమాచారం, మీ సమీపంలోని పోలీసు స్టేషన్, బస్ స్టేషన్ వివరాలు ఈ యాప్ లో ఉంటాయని వివరించారు. పోలింగ్ కేంద్రాలలోని ఓటర్ల వివరాల జాబితా, అన్నీ విధాలుగా ఓటర్లకు ఉపయోగపడేలా ఈ యాప్ రూపొందించడం జరిగిందని, ఓటర్లంతా తమ స్మార్ట్ ఫోనులో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని అన్ని వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. ముఖ్యంగా దివ్యాంగ ఓటర్లకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ చెప్పారు

No comments:

Post a Comment