Breaking News

23/03/2019

చంద్రబాబు ప్రమాణం ఎందుకంటే

విజయవాడ, మార్చి 23, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం విజయవాడలోని సివిల్ కోర్టు కాంప్లెక్స్‌‌కు వెళ్లారు. నాల్గొవ అడిషనల్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎదుట ప్రమాణం చేశారు. అదేంటి చంద్రబాబు జడ్జి దగ్గరకు వెళ్లడం.. ప్రమాణం చేయడం ఏంటని షాకవుతున్నారా.. నిజమే చంద్రబాబు ప్రమాణం చేయడం వెనుక పెద్ద కారణమే ఉందట. 


చంద్రబాబు ప్రమాణం ఎందుకంటే

చంద్రబాబు ఎన్నికల్లో కుప్పం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీడీపీ అధినేత ప్రచారంలో బిజీగా ఉండటంతో.. ఆయన తరఫున నామినేషన్ పత్రాలను టీడీపీ నేతలు శుక్రవారం రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఎన్నికల నిబంధనలం ప్రచారం.. పోటీ చేసే అభ్యర్థి రిటర్నింగ్ అధికారి వద్ద ప్రమాణం చేయాల్సి ఉంటుంది. అందుకే ఇవాళ చంద్రబాబు సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేశారన్నమాట.

No comments:

Post a Comment