Breaking News

23/03/2019

వారిది ముంచే ఫ్యామిలీ

విజయవాడ, మార్చి 23, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదం మంచు ఫ్యామిలీ వర్సెస్ టీడీపీగా మారింది. ప్రభుత్వం తన విద్యా సంస్థల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదంటూ సినీనటుడు మోహన్‌బాబు శుక్రవారం తిరుపతిలో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై మోహన్‌బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ నేత, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మోహన్‌బాబుకి కౌంటర్ ఇవ్వడం, కుటుంబరావుకి మంచు మనోజ్ ఆధారాలతో సహా ప్రశ్నలు సంధించడం జరిగాయి.  కుటుంబరావు మోహన్‌బాబు కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘మోహన్‌‌బాబు ఫ్యామిలీలో అందరూ నటులే. రాష్ట్రంలో ఇంతకంటే పచ్చి అబద్ధాలు చెప్పే కుటుంబం మరొకటి లేదు.


వారిది ముంచే ఫ్యామిలీ

మీ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ప్రకటించి.. వారి పేరిట ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసి సొమ్ము చేసుకుంటున్నది మీరు కాదా? మేనేజ్‌మెంట్ సీట్ల పేరుతో విద్యార్థుల నుంచి ఏడాదికి 5-6 లక్షల రూపాయాలు వసూలు చేస్తోంది మీరు కాదా? సమాధానం చెప్పండి. విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు వసూలుచేస్తూ లెక్చరర్స్‌కి మాత్రం తక్కువ వేతనాలు ఇస్తున్నారు. మీరు విద్య పేరుతో వ్యాపారం చేస్తున్నారు.‘కేవలం రాజకీయ కోణంలోనే మోహన్‌బాబు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మంచు ఫ్యామిలీ అంటే ముంచే ఫ్యామిలీ అని అందరూ అనుకుంటున్నారు. అబద్ధాలతో ప్రజలను మోసం చేద్దామనుకుంటే మీకే నష్టం. మీ బంధువైన వైఎస్ జగన్‌కు మేలు చేసేలా ఎన్నికల సమయంలో ఈ ఆందోళన ఎందుకు చేపట్టారు. ముసుగు తీసేసి వైసీపీ తరపున ప్రచారం చేసుకుంటే మిమ్మల్ని ఆపేదెవరు. మోహన్‌బాబు వారం రోజులుగా చెవిరెడ్డి అనే క్రిమిన‌ల్‌తో తిరుపతిలో తిరుగుతున్నారు. దీనికి ఏం సమాధానం చెబుతారు. పద్మశ్రీ వచ్చిన మహానటులు చాలామంది ఉన్నారు. కానీ మోహన్‌బాబు లాంటి నటుడికి ఆ పురస్కారం వచ్చినందుకు ఈరోజు బాధగా ఉంది.’ అని కుటుంబరావు ధ్వజమెత్తారు. 

No comments:

Post a Comment