Breaking News

12/03/2019

చంద్రబాబును నమ్మవద్దు

హైదరాబాద్, మార్చి 12, (way2newstv.in)
చంద్రబాబు సీఎం స్థాయిలో నీచంగా దిగజారి మాట్లాడుతున్నారు. 26 కేసుల్లో స్టే తెచ్చుకొని తనకు తాను నీతిమంతుడుగా చెప్పు కుంటున్నారు. చంద్రబాబు లాంటి మూర్ఖుడిని మార్చలేమని వైకాపా నేత లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు 14 ఏళ్ల సీఎం, 40 ఏళ్ల సినియార్టీలో ఎం చేయలేదు. ఆత్మ విశ్వాసం తో పార్టీని స్థాపించి ముందుకు వెళ్తున్నారు. అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొన్న చంద్రబాబు సొంతంగా అధికారంలోకి ఎప్పుడు రాలేదు. రుణ ఆంధ్ర ప్రదేశ్ గా మార్చిన ఘనత చంద్రబాబు దేనని విమర్శించారు. వైఎస్ హయాంలోనే ఐటీ అభివృద్ధి జరిగింది. 


చంద్రబాబును నమ్మవద్దు

ఎం ఫిల్ తర్వాత పిహెచ్ డి చేస్తారా ?  పిహెచ్ డి తర్వాత ఏం ఫిల్ చేస్తారా ? అది కూడా చంద్రబాబు కు తెలియదు ఆయన చదువు ఏంటో తెలుస్తుందని అన్నారు. అవినీతిలో నెంబర్ వన్ చేయగలిగావు. కాల్ మనీ కేసులో నెంబర్ వన్ చేశావ్. రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కుతున్నారు. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అమరావతి లో రాజధానికి 16 సార్లు శంఖుస్థాపన చేసి.. వర్షానికి నీళ్లు వచ్చే భవనం కట్టారని విమర్శించారు. జగన్ అనే పేరు వినిపిస్తే చాలు చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారు. విశాఖ లో వెయ్యి ఎకరాల భూమి, రాజధానిలో 50 వేల ఎకరాల భూములను టీడీపీ వాళ్లకు కట్టబెట్టిన కేసులు బయటకు తెస్తామని అన్నారు. జేడీ లక్ష్మీనారాయణ తో మీ ముసుగు తొలిగింది. ఓటుకు నోటు కేసులో దొరికింది. ఐటీ గ్రిడ్ లో దొరికింది చంద్రబాబు కాదా అని ఆమె ప్రశ్నించారు.  జగన్ చెసిన బీసీ డిక్లరేషన్ చాలా బాగుంది. విశ్వాసం తో ప్రజల నమ్మకాన్ని గెలిచేది జగన్మోహన్ రెడ్డే. తాత్కాలిక మైన  చంద్రబాబు పథకాలు నమ్మవద్దని ఆమె అన్నారు. 

No comments:

Post a Comment