Breaking News

12/03/2019

8 మంది ఎంపీలకు టీడీపీ ఖరారు

విజయవాడ, మార్చి 12, (way2newstv.in)
ఎన్నికలకు నెల రోజుల గడువే ఉండటంతో.. అభ్యర్థుల జాబితా ప్రకటనలో పార్టీలు బిజీ అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ ఈ విషయంలో ఒకడుగు ముందుంది. ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు 15 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మిగతా ఏడు స్థానాలకు కూడా అభ్యర్థుల ఎంపిక త్వరలోనే కొలిక్కి రానుంది. 15 మంది సిట్టింగ్ ఎంపీల్లో 8 మంది మాత్రమే టీడీపీ నుంచి తిరిగి పోటీ చేయనున్నారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, అమలాపురం ఎంపీ రవీంద్ర బాబు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. 


8 మంది ఎంపీలకు టీడీపీ ఖరారు

ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నామని కాకినాడ ఎంపీ తోట నరసింహం, రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాదిల భవిష్యత్తు మరి కొద్ది రోజుల్లో తేలనుంది. మాల్యాద్రిని తాటికొండ నుంచి అసెంబ్లీ బరిలో నిలపాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. వైఎస్ఆర్సీ తరఫున గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిన చలమశెట్టి సునీల్ ఈసారి తెలుగుదేశం నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన కిశోర్ చంద్రదేవ్‌ అరకు నుంచి, కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డిని కర్నూలు నుంచి పోటీ చేయనున్నారు. మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు హరీష్ మాథూర్ అమలాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉండగా.. అనంతపురం నుంచి జేసీ కుమారుడు పవన్ కుమార్ రెడ్డి బరిలో దిగనున్నారు. తొలి జాబితాను బుధవారం ప్రకటించున్నట్టు తెలుస్తోంది.

No comments:

Post a Comment