Breaking News

29/03/2019

బ్యాలెట్‌ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహణకు ఎలాంటి సమస్యా లేదదు:ఈసి

హైదరాబాద్‌ మార్చ్ 29  (way2newstv.in)
నిజామాబాద్‌ ఎంపీ స్థానానికి బ్యాలెట్‌ పద్ధతిలోనే ఓటింగ్‌ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. మొత్తం 185 మంది పోటీలో ఉన్నారని వెల్లడించింది. బ్యాలెట్‌ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహణకు ఎలాంటి సమస్యా లేదని పేర్కొంది. నిజామాబాద్‌ ఎన్నిక విషయంలో జరుగుతున్న వివిధ రకాల ప్రచారాల నేపథ్యంలో ఈ మేరకు ఈసీ స్పందించింది. రిటర్నింగ్‌ అధికారి నుంచి ఫారం-7ఏ అందగానే బ్యాలెట్‌ పత్రాలు ముద్రిస్తామని పేర్కొంది. 


బ్యాలెట్‌ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహణకు ఎలాంటి సమస్యా లేదదు:ఈసి

ప్రస్తుతం ఈసీఐఎల్‌ తయారు చేసిన ఎం2 ఈవీఎంల వినియోగం.. నోటాతో కలిపి 64 మంది అభ్యర్థులు పోటీ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమని చెప్పింది. అభ్యర్థుల సంఖ్య 63కు మించితే ఎం2 ఈవీఎంలతో పోలింగ్‌ నిర్వహణ సాధ్యం కాదని స్సష్టంచేసింది. నిజామాబాద్‌ బరిలో మొత్తం 185 మంది ఉన్నారు. తెరాస, భాజపా, కాంగ్రెస్‌, జనసేన, పిరమిడ్‌ పార్టీ, బహుజన్‌ ముక్తి, సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌ పార్టీలతోపాటు మరో 178 మంది స్వతంత్ర అభ్యర్థులుగా రైతులు పోటీకి దిగారు. దీంతో ఈవీఎంలతో ఈ ఎన్నిక నిర్వహణకు బ్యాలెట్‌ పత్రాలను వినియోగించాల్సి వస్తోంది.

No comments:

Post a Comment