బెంగళూరు మార్చ్ 29 (way2newstv.in)
బెంగళూరు కేంద్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ నామినేషన్‌ను రద్దు చేయాలని జె.జగన్ కుమార్ అనే వ్యక్తి ఎన్నికల కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అతనికి నలుగు చోట్ల ఓటుహక్కు ఉందని జగన్ కుమార్ తన పిర్యాదులో పేర్కొన్నారు.
ప్రకాశ్ రాజ్ నామినేషన్‌ను రద్దు చేయాలి:ఈసికి పిర్యాదు
తాను శాంతినగరలో ఉంటున్నట్లు నామినేషన్ పత్రాల్లో ప్రకటించిన ఆయనకు అక్కడ ఒకటి, చెన్నైలో రెండు, తెలంగాణలో ఒక చోట ఓటు హక్కు ఉన్నట్లు ఫిర్యాదులో వివరించారు. మిగిలిన చోట్ల ఓటరు పట్టీ నుంచి పేరును తొలగించాలని ఆయన ఇప్పటి వరకు అర్జీ దాఖలు చేయలేదని గుర్తు చేశారు. ఒక వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటరు పట్టీలో పేర్లు చేర్పించుకోవడం నేరమని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
No comments:
Post a Comment