Breaking News

25/03/2019

ఎల్లంపల్లికి పరిహారం దారేది

కరీంనగర్, మార్చి 25 (way2newstv.in)
2015నాటికి 18 ఏండ్లు నిండిన యువతకు అదనంగా రూ.2లక్షల పరిహారం ఇస్తామన్న సీఎం హామీ రెండేళ్లయినా అమలుకు నోచుకోలేదు. పరిహారం అడిగినప్పుడల్లా నిధుల కొరత.. లేదంటే ఎన్నికల కోడ్‌ అంటూ ఏదో ఒకటి సాకులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ కింద సర్వం కోల్పోయిన నిర్వాసితుల్లో 1200 మంది యువత రూ.2లక్షల పరిహారం కోసం ఎదురు చూస్తోంది. సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌పైనే వారంత ఆశ పెట్టుకున్నారు.


ఎల్లంపల్లికి పరిహారం దారేది

ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు 90శాతానికిపైగా పరిహారం చెల్లించారు. పునరావాసమూ కల్పించారు. ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ కింద కోటిలింగాల, ముక్కట్రావుపేట, రాంనూర్‌, చెగ్యాం, తాళ్లకొత్తపేట, ఉండెడ కూడా ముంపునకు గురవుతున్నట్టు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం గుర్తించింది. జీవో నెం.20 విడుదల చేసి పరిహారం చెల్లించింది. ఇందులో ముక్కట్రావుపేట గ్రామాన్ని మినహాయించిన అధికారులు మిగతా గ్రామాల్లో 90శాతానికిపైగా పరిహారం చెల్లింపు పూర్తి చేశారు. గెజిట్‌లో ఉన్న కొంత మంది యువతకు పరిహారం సహా పునరావాస పట్టాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో 2015నాటికి 18ఏండ్లు నిండిన యువతకు రూ.2లక్షల పరిహారం చెల్లిస్తామన్న సీఎం ప్రకటనతో రెండేండ్ల కిందట 1200 మంది అర్జీ పెట్టుకున్నారు. వారిలో 330 మంది యువతను మొదటి విడతగా గుర్తించిన అధికారులు ప్రభుత్వానికి వివరాలు పంపించారు. కానీ ఇప్పటికీ జాబితాపై స్పష్టమైన ప్రక్రియ సాగడం లేదు.

No comments:

Post a Comment