హైద్రాబాద్, ఫిబ్రవరి 18, (way2newstv.in)
మా ఘోర ఓటమి పాపం ఆ పార్టీదే అంటుంది తెలంగాణ కాంగ్రెస్. టిడిపి తో వెళితే పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా ఉనికి లేకుండా పోతామని వణికిపోతుంది. ఇదే విషయాన్ని టి అసెంబ్లీ ఎన్నికలు ముగిశాకా ధైర్యంగా అధిష్టానానికి చెప్పేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. దాంతో ఎవరికి వారే యమునా తీరే పాట ఇప్పుడు హస్తం పార్టీలో ఐక్యంగా వినిపిస్తుంది. తెలంగాణ సెంటిమెంట్ ను ప్రజల్లోకి బలంగా కెసిఆర్ తీసుకువెళుతున్న నేపథ్యంలో అనుభవం వచ్చాక కూడా టిటిడిపి తో పొత్తు పెట్టుకుంటే ఆత్మహత్య సదృశ్యమే అని భయపడుతుంది.గత ఎన్నికల్లో టిడిపి తో చెట్టా పట్టాలు వేసుకుని తిరిగిన బిజెపి ఆ తరువాత పూర్తిగా తెలంగాణ లో దూరం పెట్టేసింది. దాంతో నాటినుంచి ఒంటరి అయిపొయింది సైకిల్.
తెలంగాణలో టీడీపీతో కాంగ్రెస్ పోటీ లేనట్టే
ఒక పక్క గెలిచిన తమ ఎమ్యెల్యేలు గోడదూకి టీఆర్ఎస్ లోకి దూకేస్తున్నా నిస్సహాయంగా ఉండిపోవాలిసి వచ్చింది. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు సహా ఏ అంశం లోను ఎన్డీయే లో ఉన్నప్పటికీ టి బిజెపి స్నేహ హస్తం చాచింది లేదు. దాంతో అరకొర నాయకులతోనే నెట్టుకొచ్చి మొన్నటి అసెంబ్లీలో కాంగ్రెస్ సాయంతో తిరిగి పైకి లేవాలని చేసిన ప్రయత్నం మొత్తానికి చేటు చేసింది. ఆ ప్రభావం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పై కూడా పడటంతో దిక్కుతోచని పరిస్థితిలో ఏమి చేయాలన్న అంతర్మధనంతో కొట్టుమిట్టాడుతోంది తెలుగుదేశం.టీకాంగ్రెస్ పొమ్మంటున్న పట్టుకు వెళ్లాడాలా ? లేక స్వతంత్రంగా పుంజుకునేందుకు ఎవరితో పొత్తు లేకుండా ముందుకు పోవాలా అన్న కీలక అంశం అజెండాగా తెలంగాణ పసుపు దళం సమావేశం నిర్వహించడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ సాయంతో చక్రం తిప్పాలని చూస్తున్న బాబుకు ఈ అపశకునాలు చికాకు పెడుతున్నాయి. దాంతో ఆయన తీసుకోనున్న నిర్ణయం టిటిడిపి కి దశ దిశా నిర్దేశించనున్నాయి. పైకి తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోనని చంద్రబాబు చెబుతున్నా టిటిడిపి ఎల్ రమణ బొమ్మగా మాత్రమే వ్యవహరిస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ చాణుక్యుడి అడుగులు రెండు తెలుగు రాష్ట్రాల్లో పసుపు పార్టీని ముంచుతాయో, తెలుస్తాయో చూడాలి.
No comments:
Post a Comment