Breaking News

18/02/2019

మిత్రుడి కోసం కేసీఆర్ స్టైల్ రాజకీయాలు...

రిటర్న్ గిఫ్ట్స్ అంటూ ప్రచారం
హైద్రాబాద్, ఫిబ్రవరి 18, (way2newstv.in)
తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పరోక్షయుద్ధానికి కేసీఆర్ తెర తీశారు. తనమిత్రుడు జగన్ కు సహాయసహకారాలు అందించేందుకు వ్యూహాత్మక పంథాలో కదులుతున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతుండగా వైసీపికి నైతికస్థైర్యం కల్పించేందుకు అనువైన ప్రాతిపదికను సిద్ధం చేస్తున్నారు. ప్రజామద్దతును మినహాయిస్తే అధికార తెలుగుదేశం పార్టీతో పోలిస్తే జగన్ పార్టీ అన్నివిధాలుగా బలహీనమైనదిగానే చెప్పాలి. సో... వాటికి చెక్ పట్టే పనిలో పడ్డారు గులాబీ బాస్ ఆంధప్రదేశ్ రాజకీయాల్లో అధికారపార్టీ తరఫున కీలకంగా ఉంటూ హైదరాబాదుతో వ్యాపార సంబంధాలున్నవారిపై టీఆర్ఎస్ దృష్టి సారిస్తోంది. వైసీపీకి అనుకూలంగా వారిని మార్చేందుకు సామదాన దండోపాయాల ను ప్రయోగించేందుకు యత్నిస్తోందని టీడీపీ అనుమానిస్తోంది. సహజంగానే వ్యాపారలక్షణాలున్న నాయకులు తొందరగా లొంగిపోతారు.


మిత్రుడి కోసం కేసీఆర్ స్టైల్ రాజకీయాలు...

ప్రభుత్వం తరఫున యంత్రాంగం దాడులకు పూనుకుంటే తమ సంస్థల ప్రతిష్ఠ శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఆ రకమైన సంకేతాలు అందగానే చెప్పినట్లు చేసేస్తుంటారు. కడపలో ఇటీవలి కాలంలో వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే కాంట్రాక్టుల ప్రయోజనాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతోనే ప్లేటు ఫిరాయించారనేది అధికారపార్టీ ఆరోపణ. అలాగే విశాఖ జిల్లాకు చెందిన ఎంపీ విద్యాసంస్థలు నష్టపోతాయనే ఉద్దేశంతో వైసీపీ వైపు వెళ్లాల్సి వచ్చిందంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ హవాకు మరో అయిదేళ్ల వరకూ ఢోకా లేదు. ఎంపీ ఎన్నికలతో సంబంధం లేదు. ఈ కారణంతోనే ప్రత్యర్థులపై దృష్టి పెట్టేంత సానుకూలత లభిస్తోంది. జగన్ కు ఇచ్చిన హామీ మేరకు ఆర్థికంగా సంపన్నులైన టీడీపీ నేతలను పార్టీ మారేలా ప్రోత్సహించడంతో ప్రతిపక్షం బలపడేలా టీఆర్ఎస్ సహకరిస్తోందనేది ప్రధాన అభియోగం.అధికార యంత్రాంగం నుంచి తోడ్పాటు ఉండదు. ఆర్థికంగా జగన్ సంపన్నుడే. కానీ పార్టీకి నిధుల కొరత ఉంది. సొంత ఆస్తులను కరిగించి పార్టీకి పెట్టేంత ఉదారత అధినేతకు లేదు. దాంతో అభ్యర్థులే నిధులు సమకూర్చుకోవాలి. మరోవైపు కేసుల బెడద వెన్నాడుతోంది. వీటన్నిటికీ పరిష్కారం వెదుక్కునే క్రమంలో భాగంగానే కేసీఆర్ తో చేయి కలిపేందుకు సిద్ధమయ్యారు జగన్. ప్రజల సెంటిమెంటుతో ముడిపడిన ఎలక్షన్ పాలిటిక్స్ లో అది ప్రయోజనకరమవుతుందో లేదో చెప్పలేం. కానీ ముందస్తుగా వైసీపీకి అనుకూలమైన మూడ్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతోంది. తెలుగురాష్ట్రాల్లో చాలామంది నేతలు హైదరాబాదుతో ఆర్థిక సంబంధాలు కలిగి ఉన్నారు. కాంట్రాక్టులు, విద్యాసంస్థలు, వైద్యాలయాలు నడుపుతున్నవారు చాలామందే ఉన్నారు. ప్రభుత్వం తలచుకుంటే వారిని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టవచ్చు. కాంట్రాక్టుల విషయంలో నాణ్యత పేరు చెప్పి బిల్లులు నిలిపివేయడం, జాప్యం చేయడం వంటి విషయాల్లో చికాకు పెట్టవచ్చు. అదే విధంగా విద్యాసంస్థలు, రియల్ వ్యాపారాలు, వైద్యాలయాలు, హోటళ్లు, పబ్ ల విషయంలోనూ ప్రతిపనిలోనూ లొసుగులు వెదకడం ద్వారా ముందడుగు వేయలేని స్థితి ఉంటుంది. సాధారణంగా ఇదంతా పైకి చూస్తే అధికారులు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ పరోక్షంగా ప్రభుత్వ రాజకీయ ప్రేరణ వెనకనుంచి పనిచేస్తుంది. అధికారులు సాధారణ పరిస్థితుల్లో రాజకీయ నాయకుల వ్యాపారవ్యవహారాల జోలికి పోరు. ఏదేని ఒత్తిడి, ఉద్దేశం తో తగినంత రాజకీయ మద్దతు లభించినప్పుడే దాడుల వంటివాటికి పూనుకుంటారు. ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకుంటూ హైదరాబాద్ కేంద్రంగా కాంట్రాక్టులు, వ్యాపారాలు కలిగిన టీడీపీ రాజకీయ నాయకులను టీఆర్ఎస్ లక్ష్యంగా చేసుకుంటోందనే అనుమానాలు టీడీపీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. దాడులు చేయకపోయినా అలాంటిది జరగుతుందనే వాతావరణాన్ని కల్పించడం ద్వారా టీడీపీ నాయకుల గుండెల్లో తెలంగాణ అధికారపక్షం రైళ్లు పరిగెట్టిస్తోందంటున్నారు.ప్రస్తుతం సాగుతున్న పరిణామాలను పరిశీలకులు పెద్ద వింతగా చూడటం లేదు. అధికార టీడీపీని టీఆర్ ఎస్ సహకారంతో వైసీపీ టైమ్ చూసి దెబ్బతీస్తోందంటున్నారు. వైసీపీ తరఫున ఎన్నికైన 23 మంది ఎమ్మెల్యేలను వివిధ రకాల ప్రలోభాలతో టీడీపీ ఆకర్షించింది. నలుగురిని మంత్రులను చేసింది. ప్రతిపక్షాన్ని బలహీనపరిచింది. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్ సైతం నిస్సహాయంగా చేతలుడిగి చూస్తుండిపోయారు. కేంద్రంలో భాగస్వామిగా ఉండటంతో టీడీపీ ని ఎవరూ నిలదీసే వారు లేకపోయారు. వైసీపీ ఆవేదన అరణ్యరోదనగా మిగిలిపోయింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో బలమైన భరోసాతో హామీలతో టీడీపీ నేతలను వైసీపీ తనవైపు ఆకర్షించుకోవడం తప్పుకాదనే భావన నెలకొంది. టీఆర్ఎస్ సహకారం తీసుకోవడమూ రాజకీయ అవసరమే. అందుకే టీడీపీ ఇప్పుడు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు పెద్దగా ప్రాధాన్యం లభించడం లేదు. దెబ్బకు దెబ్బ తీస్తున్నామని వైసీపీ నాయకులు జబ్బలు చరుచుకుంటున్నారు. ప్రతివ్యూహాన్ని సిద్ధం చేసే పనిలో పడింది టీడీపీ . ఈ వలసలను నిరోధించకపోతే ఎన్నికలకు ముందు వాతావరణం తమకు ప్రతికూలంగా మారుతుందని టీడీపీలో ఆందోళన నెలకొంటోంది.
కేఎపాల్ తో  జగన్ కు ఇబ్బందే... 
కెఎ పాల్ ప్రజాశాంతి పార్టీ రూపంలో వైఎస్సాఆర్ పార్టీకి ముప్పు పొంచి ఉందా ? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ పార్టీకి హెలికాఫ్టర్ గుర్తును ఎన్నికల సంఘం ఇచ్చింది అని పాల్ చెబుతున్నారు. అదే గుర్తు అయితే వైసిపి ఓట్లకు చిల్లు తప్పదని పలువురు భావిస్తున్నారు. హెలికాఫ్టర్ పై వుండే ఫ్యాన్ రెక్కలు చూసి ఇదే ఫ్యాన్ గుర్తుగా నిరక్షరాస్యులు భావించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. దీనిపై అభ్యంతరం ముందే వ్యక్తం చేయాలని సూచిస్తున్నారు వారు.మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గుర్తు కారు ఓట్ల శాతం ఆ పార్టీ ఊహించిన దానికన్నా గణనీయంగా తగ్గింది. దీనికి కారణం కారును పోలిన గుర్తులను పలు నియోజక వర్గాల్లో స్వతంత్రులకు ఈసీ కేటాయించడంతో సీన్ సితార అయ్యి కొందరు అనూహ్యంగా స్వల్ప తేడాతో ఓడిపోయారు. మరికొందరు బొటా బోటి గా గట్టెక్కారు. ఎన్నికల అనంతరం తమకు ఇంకా రావలిసిన సీట్లు రాకపోవడానికి గుర్తుల్లో వచ్చిన దగ్గర పోలికలే కొంప ముంచాయని గులాబీ పార్టీ గుర్తించింది.ఆ వెంటనే ప్రమాణ స్వీకారం పూర్తి అయిన వెంటనే కెసిఆర్ స్వయంగా ఢిల్లీ వెళ్లి ఈసీకి గుర్తుల కేటాయింపుపై తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదును అందించాయి. దీనిపై పరిశీలన జరిపిన ఈసీ టిఆర్ఎస్ కు నష్టం లేకుండా చూస్తామని హామీనిచ్చింది. ఇప్పుడు వైసిపి కూడా ముందే మేలుకొని నష్టనివారణ చర్యలు చేపట్టాలని ఆ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం.

No comments:

Post a Comment