.గురువారం పోచారం గ్రామానికి సీఎం కేసీఆర్
బాన్సువాడ (కామారెడ్డి జిల్లా) ఫిబ్రవరి 6 (way2newstv.in)
మాతృవియోగం పొందిన రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పరామర్శించనున్నారు.
గురువారం పోచారం గ్రామానికి సీఎం కేసీఆర్
ఇందుకోసం అయన బాన్సువాడ మండలం పోచారం గ్రామం రానున్నారు. ముఖ్యమంత్రి రాకపై జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే అధికారికంగా సమాచారం అందగా, ముఖ్యమంత్రి రక్షణ సిబ్బంది బాన్సువాడ కు చేరుకున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా బాన్సువాడ చేరుకోనున్న ముఖ్యమంత్రి నేరుగా స్పీకర్ స్వగ్రామం పోచారం చేరుకోని స్వర్గీయ పాపవ్వ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించి స్పీకర్ ను, కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.
No comments:
Post a Comment