సర్పంచ్ లకు ముఖ్య మంత్రి కేసీఆర్ ఉద్భోద
హైదరాబాద్ ఫిబ్రవరి 6 (way2newstv.in)
గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్‌లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే రిసోర్స్ సభ్యులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.గ్రామాల వేదికగానే ప్రగతి ప్రణాళికలు అమలు కావాలి. సర్పంచ్‌లు, వార్డు సభ్యులు.. గ్రామాల ప్రజలను కలుపుకొని సామూహికంగా గ్రామ వికాసానికి పాటు పడాలి. గ్రామ పంచాయతీలకు అవసరమైన నిధులు విధులు కేటాయిస్తాం. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పనిచేయాలి.
గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి
మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా, రహదారుల నిర్మాణం వంటి ముఖ్యమైన పనులన్నీ ప్రభుత్వమే నేరుగా చేస్తోందని సీఎం తెలిపారు. గ్రామాల్లో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం, స్మశాన వాటికల నిర్మాణంపై పంచాయతీలు ఎక్కువ దృష్టి పెట్టాలి. గ్రామాల సర్పంచులను గ్రామ కార్యదర్శులను చేంజ్ ఏజెంట్లుగా మార్చే బాధ్యతలను రిసోర్స్ సభ్యులు చేపట్టాలి. గ్రామ పంచాయతీలకు అధికారాలను బదిలీ చేసే విషయంలో నిధులు కేటాయించే విషయంలో అత్యంత ఉదారంగా ఉంటాం. అదే సమయంలో నిధుల దుర్వినియోగాలనికి పాల్పడినా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా సర్పంచులు గ్రామ కార్యదర్శులను సస్పెండ్ చేసే విధంగా కఠిన చట్టం రూపొందిస్తమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్కే జోషి, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, వేముల ప్రశాంత్ రెడ్డి. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిబొల్లం మల్లయ్య యాదవ్ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment