Breaking News

27/02/2019

వైజాగ్ లో దారుణం

విశాఖపట్టణం, ఫిబ్రవరి 27, (way2newstv.in)
విశాఖ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులకు మంచి బుద్ధులు చెబుతూ వారిని భావి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారాడు. విద్యార్థినికి లిఫ్ట్ ఇస్తానని చెప్పి బైక్ ఎక్కించుకున్న అతడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా వేపాడ మండలం కుంపల్లికి చెందిన గుమ్మాల కొండబాబు విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం ఎల్‌.ఎన్‌.పురం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. 


వైజాగ్ లో దారుణం

మంగళవారం ఉదయం బైక్‌పై దేవరాపల్లి నుంచి తురువోలు వెళ్తున్నాడు. దేవరాపల్లి మండలానికి చెందిన ఓ బాలిక తురువోలు ఉన్నత పాఠశాలకు అదే మార్గంలో నడిచి వెళ్తోంది. ఆమెను స్కూల్‌ వద్ద దింపుతానని చెప్పి కొండబాబు బైక్ ఎక్కించుకున్నాడు. మార్గమధ్యంలో అతడిలోని కీచకుడు బయటికొచ్చాడు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో బైక్ ఆపిన విద్యార్థినిని సమీపంలోని పూరిపాకలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో అటువైపుగా వెళుతున్న కొందరు గమనించి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చీడికాడ ఎస్సై ఎల్‌.సురేశ్‌కుమార్‌ చెప్పారు. నిందితుడు కొండబాబును సస్పెండ్‌ చేస్తూ విశాఖ డీఈవో ఉత్తర్వులిచ్చినట్లు చీడికాడ ఎంఈవో కె.గంగరాజు తెలిపారు. 

No comments:

Post a Comment