Breaking News

09/02/2019

కొలిక్కి వచ్చిన జమ్మలముడుగు పంచాయితీ

కడప, ఫిబ్రవరి 9, (way2newstv.in
తెలుగుదేశం పార్టీలో కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పంచాయితీ కొలిక్కివచ్చింది. జమ్మలమడుగు పీటముడిని సీఎం చంద్రబాబు విప్పారు. జమ్మలమడుగు నియోజకవర్గ అభ్యర్థి ఎంపికపై గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఇవాళ సీఎం చంద్రబాబు తెరదించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి, వైకాపా అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి పోటీ చేశారు. 

 
కొలిక్కి వచ్చిన జమ్మలముడుగు పంచాయితీ

ఆ ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి విజయం సాధించి... కొంత కాలం తర్వాత తెదేపాలో చేరారు. అప్పటి నుంచి జమ్మలమడుగు నియోజకవర్గ తెదేపా టికెట్‌ ఎవరికి దక్కుతుందనే అంశంపై రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.ఇదే విషయంపై పలు మార్లు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి సీఎం చంద్రబాబు వద్ద చర్చలు జరిపారు. ఇద్దరూ కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని చంద్రబాబు సూచించారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఇద్దరు నేతలు పరస్పర అంగీకారానికి వచ్చారు. జమ్మలమగుడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి పోటీ చేయాలని, కడప పార్లమెంట్‌ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి పోటీ చేయాలని, ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఒప్పందం మేరకు రామసుబ్బారెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు అందజేశారు.రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి ఒక్కటవ్వడంతో జమ్మలమడుగు నియోజకవర్గంలో తెదేపా విజయఢంకా మోగిస్తుందని తెదేపా శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. దశాబ్దాలుగా బద్ధ విరోధులుగా ఉన్న వీరిద్దరూ చంద్రబాబు సమక్షంలో పరస్పరం పలుకరించుకున్నారు. ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి ఇద్దరూ ఎమ్మెల్యే సీటు కోసం పట్టుపడుతున్నారు. చంద్రబాబు నిర్ణయం మేరకు ఎమ్మెల్సీ పదవికి రామసుబ్బారెడ్డి రాజీనామాకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ చర్చలు సఫలమయ్యాయని టీడీపీ వర్గాలు చెబుతున్నారు. 

No comments:

Post a Comment