Breaking News

09/02/2019

పదేళ్ల నుంచి సాగుతున్న లోకో ట్రాక్షన్ షెడ్ నిర్మాణం పనులు

అనంతపురం, ఫిబ్రవరి 9, (way2newstv.in)
 గుంతకల్లు రైల్వే డివిజన్‌కు తలమానికమైన రైల్వే విద్యుత్ లోకో ట్రాక్షన్ షెడ్ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. షెడ్ నిర్మాణానికి 2008లో అనుమతులు మంజూరు కాగా నిధుల కొరత కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం విడుదల చేసిన మధ్యంతర బడ్జెట్‌లో సైతం ట్రాక్షన్ షెడ్ నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు లభించలేదు. పెరిగిన ప్రయాణికుల అవసరాల అనుగుణంగా డివిజన్‌లో అభివృద్ధి వేగం పుంజుకుంది. ఇందులో భాగంగానే గుంతకల్లు డివిజన్‌లోని గుంతకల్లు-వాడీ, గుంతకల్లు-చెనె్న, గుంతకల్లు-్ధర్మవరం, గుంతకల్లు-కల్లూరు, గుత్తి- ధర్మవరం ఎలక్ట్ఫ్రికేషన్ పనులు పూర్తయ్యాయి. దీంతో గుంతకల్లు నుంచి ప్రధాన మార్గాలకు విద్యుత్ లోకోలతో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. 


పదేళ్ల నుంచి సాగుతున్న లోకో ట్రాక్షన్ షెడ్ నిర్మాణం పనులు

ఇందుకు అనుగుణంగా గుంతకల్లు రైల్వే డివిజన్ కేంద్రంలో దాదాపు 100 లోకోల నిర్వహణ సామార్థ్యంతో విద్యుత్ లోకో షెడ్ నిర్మించేందుకు రైల్వే యాజమాన్యం నిర్ణయించి స్థానిక రైల్వేస్టేషన్ వద్ద ఉన్న డీజిల్ షెడ్ సమీపంలో 2015లో ట్రాక్షన్ షెడ్ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు రూ.150 కోట్ల అతిపెద్ద భారీ ప్రాజెక్టు ఇది. దీంతోపాటు రూ.5 కోట్లతో ట్రిప్ షెడ్ నిర్మాణం చేపట్టారు. అయితే ఏళ్లు గడుస్తున్నా ట్రాక్షన్ షెడ్ పనులు మాత్రం మందకొడిగా సాగుతున్నాయి. ఫలితంగా ఎప్పటికప్పుడు పెరిగిన అంచనా వ్యయాలతోపాటు అధునాతమైన మార్పులు చేస్తూ పనుల సాగుతుండటంతో కనీసం ట్రాక్షన్ షెడ్‌లో తొలి దశ పనులు పూర్తి చేయలేకపోవడం విశేషం. షెడ్‌లోలో లిఫ్ట్ బే, మీడియం లిఫ్ట్‌బే, హేవీ లిఫ్ట్‌బే పనులు జరుగుతున్నాయి. లోకో వాషింగ్ చేయడానికి, సిబ్బంది చేయడానికి సౌకర్యాలను కల్పించడంతోపాటు సామగ్రిని నిల్వ చేసుకోవడానికి స్టోర్ నిర్మాణం పనులు, కార్యాలయాలకు భవనాలు నిర్మించాల్సి ఉంది. ఈవిధంగా పనులు నత్తనడకన సాగితే షెడ్ పూర్తి కావడానికి మరో రెండు, మూడేళ్లు సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం గుంతకల్లు రైల్వే డివిజన్‌లో ట్రాక్షన్ షెడ్ నిర్మాణం అత్యవసరం కానుంది. అప్పటి వరకు కేవలం తిరుపతి నుండి వస్తున్న ఎలక్ట్రికల్ లోకోను నిర్వహిస్తున్నారు. భవిష్యత్‌లో పెరగనున్న లోకోల అనుగుణంగా ట్రాక్షన్ షెడ్‌ను త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించాల్సిన అవసరం ఉంది.

No comments:

Post a Comment