Breaking News

24/08/2018

భారతీయులందరికీ 2022లోపు సొంత ఇళ్లు ఉండాలన్నదే తన కల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

అహ్మదాబాద్‌ ఆగష్టు 24 (way2newstv.in)  
భారతీయులందరికీ 2022లోపు సొంత ఇళ్లు ఉండాలన్నదే తన కల అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గురువారం గుజరాత్‌లో పర్యటిస్తున్న ఆయన రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. వల్సద్‌ జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద నిర్మించిన సుమారు లక్ష ఇళ్లలో ఈ రోజు గృహ ప్రవేశాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జజ్వా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ... ‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద సొంతిళ్లు పొందిన మహిళలతో ఈ రోజు నాకు మాట్లాడే అవకాశం వచ్చింది. 



భారతీయులందరికీ 2022లోపు సొంత ఇళ్లు ఉండాలన్నదే తన కల
               ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

రక్షా బంధన్‌ పండుగకు ఆడపడుచులకు సొంతిళ్లు ఇవ్వడం కన్నా గొప్ప బహుమతి ఏదీ ఉండదు. ఆ పండుగకు కొన్ని రోజుల ముందే గుజరాత్‌లోని లక్ష మంది మహిళలు సొంతిళ్లు పొందారు. ఆ ఏడాది భారత్‌ 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనుందని వ్యాఖ్యానించారు. భారతీయులందరికీ 2022లోపు సొంతిళ్లు ఉండాలన్నదే నా కల. ఆ ఏడాది భారత్‌ 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనుంది. ఇప్పటి వరకు రాజకీయనాయకులు సొంతిళ్లు నిర్మించుకున్నారనే వార్తలనే మనం విన్నాం. కానీ, ఇప్పటి నుంచి పేదలు సొంతిళ్లు పొందారనే వార్తలు వింటాం’ అని మోదీ అన్నారు.‘ప్రధానమంత్రి ఆవాజ్‌ యోజన కింద ఇళ్లు పొందేందుకు ఎటువంటి లంచాలు ఇచ్చుకునే అవసరం లేదు. ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే మధ్యవర్తులను సంప్రదించాల్సిన పని లేదు. అప్పట్లో బ్యాంకులు పేదలకు అప్పులిచ్చే పరిస్థితి లేదు. కానీ, ఇప్పుడు అవి పేదల వద్దకే వచ్చి రుణాలిస్తామని అంటున్నాయి. గుజరాత్‌ నాకు ఎన్నో నేర్పించింది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ఇళ్లు పొందడంలో మహిళలు ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రూపాయి కూడా లంచం ఇచ్చే అవసరం రాలేదని నాతో చెప్పారు’ అని మోదీ అన్నారు.

No comments:

Post a Comment