Breaking News

28/07/2018

సీఎం కావాలనుకుంటే ఎప్పుడో అయ్యేదాన్ని :హేమమాలిని

జైపూర్, జూలై 28 (way2newstv.in)  
సీఎం కావడం తనకు పెద్ద విషయమేమీ కాదంటున్నారు నటి, ఎంపీ హేమ మాలిని. రాజస్థాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆమె.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిపై మీడియా ప్రశ్నించగా ఆమె స్పందించారు. ‘నేను తలచుకుంటే నిమిషంలో సీఎం అవ్వగలను.. కాని నాకు ఆ పదవిపై ఆసక్తి లేదు. ఒకవేళ సీఎం అయినా కొన్నింటిని కోల్పోవాల్సి వస్తుందన్నారు’హేమ. నేను సినిమా కెరీర్ వల్లే ఎంపీ అవ్వగలిగాను.. బాలీవుడ్‌ సినిమాలతో అందరికి పరిచయం అయ్యాను. తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను.. అంతకుముందు కూడా బీజేపీ తరపున ఎన్నో కార్యక్రమాలు చేశాను. నాలుగేళ్లగా నియోజకవర్గంలో ఎన్నో పనులు పూర్తి చేయగలిగా.. నరేంద్ర మోదీ వంటి ప్రధాని మరెక్కడా ఉండరు. ఆయన పేదలు, మహిళల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నారన్నారు.’ 



సీఎం కావాలనుకుంటే ఎప్పుడో అయ్యేదాన్ని :హేమమాలిని 

No comments:

Post a Comment