Breaking News

28/07/2018

బీజేపీకి పాత ఆఫీస్ పై నుంచే ఎన్నికల వ్యూహాం

న్యూఢిల్లీ జూలై 28 (way2newstv.in)  
ఆచార వ్యవహారాలకు, సెంట్‌మెంట్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌గా చేప్పుకునే బీజేపి పార్టీ. 2019 ఎన్నికల వ్యుహా రచన అత్యాధునికంగా నిర్మించుకున్న కోత్త ఆఫీసా లేక గత ఎన్నికల్లో ఘన విజయం సాధించటానికి కేంద్రం అయిన పాత కార్యాలయమా తెలుసుకోవాలంటే వాచ్‌ ది స్టోరీ.....అయిదు నెలల కిందట భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్ దిల్లీలో కొత్త ఆఫీసులోకి మారింది. ఈ కొత్త ప్రధాన కార్యాలయ భవనం గురించే మొన్న అవిశ్వాస చర్చలో తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ప్రస్తావించారు. నిధులన్నీ కుమ్మరించి తక్కువ సమయంలో కొత్త ఆఫీసు కట్టుకున్నారు. కానీ ఏపీ రాజధానికి సహకరించరా అని ఆయన ప్రశ్నించారు.బీజేపీ 2019 ఎన్నికల కోసం కొత్త కార్యాలయాన్ని ఉపయోగించుకునే ఆలోచనను మానుకుందట. 



బీజేపీకి పాత ఆఫీస్ పై నుంచే ఎన్నికల వ్యూహాం

ఎప్పటి నుంచో ఉన్న పాత ఆఫీసు కేంద్రంగానే 2019 ఎన్నికలకు రెడీ కావాలని నిర్ణయించిందట. అత్యాధునిక - విశాలమైన కార్యాలయాన్ని వదులుకుని పాత ఆఫీసుకే మళ్లీ ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారా... అందుకు కారణం కొత్త బిల్డింగ్ కలిసి రాకపోవడమేనట.బీజేపీ కొత్త ఆఫీసు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కు  కూతవేటు దూరంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ లో ఉంది. కొత్తగా నిర్మించింది కాబట్టి విశాలంగా ఉండడంతో పాటు సదుపాయాలు - పార్కింగ్ వంటివన్నీ ప్లాన్ చేసి కట్టుకున్నారు. ఇక పాత కార్యాలయం అశోకా రోడ్ లో ఆంధ్ర భవన్ కు సమీపంలో ఉంది. 2014  ఎన్నికలకు పథక రచనంతా ఇక్కడి నుంచే సాగింది. ఈ సారి కూడా ఇదే కార్యాలయాన్నే వాడాలని పలువురు సీనియర్లు సూచిస్తున్నారు.కొత్త కార్యాలయంలోనికి మారిన తరువాత ఎన్నికల్లో వైఫల్యాలు పెరిగాయని.. మిత్ర పక్షాలతో వ్యవహారాలూ చెడ్డాయని సీనియర్లు చెబుతున్నారు.  కొత్త ఆఫీసుకు మారిన తరువాత..... గోరఖ్ పుర్ - ఫూల్ పుర్ - కైరానా వంటి పట్టున్న ప్రాంతాల్లోనూ ఓడిపోయింది. ఇక కర్నాటక విషయానికొస్తే అత్యధిక సీట్లు గెలిచిన ఏమీ చేయలేకపోయింది. అధికారం చేజారింది. ఏపీలో టీడీపీ ఎన్డీయే నుంచి బయటకొచ్చి బీజేపీపై కత్తి కట్టి పోరాడుతోంది. మరో మిత్ర పక్షం శివసేన కూడా దూరమైంది.దీంతో అసలే సెంటిమెంట్లను పట్టించుకునే బీజేపీ నేతలు వచ్చే ఎన్నికల విషయంలో రిస్కు తీసుకోదలచుకోలేదట. అందుకే... కలిసొచ్చిన పాత ఆఫీసు కేంద్రంగానే త్వరలో ఎన్నికల ప్రచార పర్వానికి తెర తీయనున్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment