Breaking News

28/07/2018

పెదనాన్నతో నిహారిక స్క్రీన్ షేర్

హైద్రాబాద్,జూలై 28 (way2newstv.in) 
‎మెగా ప్రిన్సెస్ నిహారిక... మంచి ఊపు మీద ఉంది. ఇటు టాలీవుడ్ లోనూ అటు కోలీవుడ్ లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటోన్న ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే పెద్దనాన్నతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్ధమవుతోందట. ఆ విశేషమేంటో తెలుసుకోవాల్సిందే మరి. హ్యాపీ వెడ్డింగ్ సినిమాతో పెళ్లి ముచ్చట్లు చెప్పేందుకు సిద్ధమవుతున్న నిహారిక.. క్రమంగా బిజీ హీరోయిన్ గా మారుతోంది. ఓ వైపు కోలీవుడ్ లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటోన్న ఈ సొగసరి.. ఇప్పుడు ఇంటివైపు నుంచి నరుక్కు వచ్చేందుకు రెడీ అయిపోతోందట. రేపు హ్యాపీ వెడ్డింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతున్న నిహారిక... ఆ సినిమా ప్రమోషన్స్ లో పాలుపంచుకుంటేనే పెద్దనాన్న సినిమాపై ఓ కన్నేసిందట. మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రం సైరా లో ఓ చిన్న రోల్ దొరికినా చాలని టాప్ హీరోయిన్లు సైతం క్యూలు కడుతోందట. నిహారిక ఆ ఛాన్స్ ను కొట్టేసింది. అబ్బా అయితే అమ్మాయి ఇరగదీసేస్తుందని మురిసిపోకండి. సైరాలో అమ్మడికి ఆఫర్ చేసింది ఓ చిన్న రోల్ మాత్రమే. అది కూడా ఓ బోయ అమ్మాయి గా ఒకటి రెండూ ఫ్రేమ్స్ లో మాత్రమే కనిపిస్తుందట. మరి ఈ మాత్రం దానికి నిహారిక ఎందుకు అన్న అనుమానం వస్తుంది. కానీ, ఇందుకోసం అమ్మాయే తెగ పోరుపెట్టిందట. ఆమె ముచ్చట కాదనలేక సురేందర్ రెడ్డి... ఓ చిన్న వేషం వేసే అవకాశం ఇచ్చాడు. మరి.. ఈ స్మాల్ రోల్ లో నిహారిక ఎలా షైన్ అవుతుందో చూడాలి. 



పెదనాన్నతో నిహారిక స్క్రీన్ షేర్ 

No comments:

Post a Comment