Breaking News

12/07/2018

గ్రామీణ గృహ నిర్మాణాలపై మంత్రి కాలవ సమీక్ష

అమరావతి, జూలై 12, (way2newstv.in)
గ్రామీణ గృహానిర్మాణంపై జిల్లాల హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లతో తాడేపల్లి హౌసింగ్ కార్యాలయంలో మంత్రి కాలవ శ్రీనివాసులు సమీక్ష జరిపారు. 3 లక్షల గృహప్రవేశాల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గృహనిర్మాణ అధికారులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. మంత్రి మాట్లాడుతూ గృహనిర్మాణ సంస్థ చరిత్రలోనే ఈ కార్యక్రమం ఓ మైలురాయి లా మిగులుతుంది.  గృహనిర్మాణంపై అన్ని వర్గాల్లో సంతృప్తి వ్యక్తమవుతోందని అన్నారు.  వచ్చే పది నెలల కాలం సంస్థకు ఎంతో కీలకం, విశ్రమించకుండా పనిచేసి సంస్థ అప్పగించిన లక్ష్యాలను చేరుకోవాలి. కడప, విజయనగరం జిల్లాలు గృహానిర్మాణంలో వెనుకబడి వున్నాయి, రానున్న రోజుల్లో ఈ జిల్లాల్లో మరింతగా ప్రగతి సాధించాలి. వెనుకబడిన జిల్లాల్లో గృహానిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి ఇళ్లు పూర్తయ్యేలా చూడాలి.  గృహనిర్మాణ సంస్థ లోని అన్ని స్థాయిల ఉద్యోగుల సేవలు వినియోగించుకొని గృహనిర్మాణ కార్యక్రమాలు వేగవంతం చేయాలన్నారు.  ఈ సమావేశంలో పాల్గొన్న గృహనిర్మాణ సంస్థ ఎం.డి. కాంతిలాల్ దండే, చీఫ్ ఇంజినీర్ మల్లికార్జున రావు, ఇతర అధికారులు పాల్గోన్నారు.



గ్రామీణ గృహ నిర్మాణాలపై మంత్రి కాలవ సమీక్ష

No comments:

Post a Comment