హైదరాబాద్, జనవరి 9 (way2newstv.in)
దేశంలోనే తెలంగాణా రాష్ట్రం అభివృద్ధి పధంలో పురోగమిస్తోందని దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఏర్పడ్డ శాంతీయుత పరిస్తితులేనని రాష్ట్ర హోమ్ శాఖా మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. రవీంద్రభారతీలో జరిగిన పోలీస్ మెడల్స్ ప్రాధానోత్సవ కార్యక్రమానికి మంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. 418 మంది వివిధ హోదాల్లో ఉన్న పోలీస్ అధికారులకు జరిగిన ఈ పోలీస్ మెడల్స్ ప్రదానోత్సవం జరిగింది. డీ.జీ.పీ ఎం.మహేందర్ రెడ్డి,హోం శాఖ కార్యదర్శి రవి గుప్త, ఇతర సీనియర్ పోలీస్ అధికారులు హాజరైన ఈ కార్యక్రమంలో మహమూద్ అలీ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిస్థితి అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన సి.ఎం. కె.సి.ఆర్, పోలీస్ శాఖకు గతంలో ఎన్నడూ లేనంతగా నిధులను కేటాయించారని గుర్తు చేశారు.
తెలంగాణా రాష్ట్రం అభివృద్ధికి శాంతీయుత పరిస్తితులే కారణం: హోమ్ మంత్రి
ఆధునిక, సాంకేతిక పద్దతుల వినియోగం, ఫ్రెండ్లీ పోలీసింగ్ లో తెలంగాణా పోలీసులు అత్యున్నత స్థాయిలో వున్నారని కితాబునిచ్చారు. పోలీసు ఉద్యోగం అంటే ఇతర ఉద్యోగాల మాదిరి కాదని, కుటుంబ పరిస్థితులను లెక్క చేయకుండా అత్యంత ప్రతికూల పరిస్తుతుల్లో తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని ఎదుర్కుంటూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, ఈ విషయంలో తెలంగాణా పోలీస్ ముందంజలో ఉందని మంత్రి అభినందించారు. గత 6సంవత్సరాలలో కర్ఫ్యూ లేదని అన్నారు. కేవలం శాంతి భద్రతల పరిరక్షణలోనే కాకుండా భాద్యతల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారని అన్నారు. హరితహారం, పల్లె ప్రగతిలో పోలీసు అధికారులు యాక్టీవ్ గా పాల్గొన్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్. పిలుపు మేరకు సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమంలోనూ పాల్గొనడం పట్ల మహమూద్ అలీ అభినందించారు. హైదరాబాద్ లో నిర్మిస్తున్న 20 అంతస్తుల కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభమైతే శాంతి భద్రతలు, ఇతర కార్యక్రమాలను మరింత అద్భుతంగా పర్యవేక్షించే అవకాశం ఉంటుందని అన్నారు. రాష్ట్ర పోలీసు శాఖలో కొత్తగా 18 వేల మంది సిబ్బంది నియామకం పూర్తయిందని వీరికి ఈ నెల 17 వ తేదీ నుండి శిక్షణనిస్తున్నామని తెలిపారు. డీ.జీ.పీ. మహేందర్ రెడ్డి ప్రసంగిస్తూ, పోలీస్ మెడల్స్ పొందిన అధికారులు, సిబ్బందిని అభినందించారు., ఈ పురస్కారాలతో మరింత ఉత్సాహంగా పౌర సేవలను అందించాలని పోలీసు అడికారులకు సూచించారు . ఈ కార్యక్రమంలో సీనియర్ పోలీసు అధికారులు జితేందర్,సా జయ జైన్, సందీప్ షాండిల్య,అభిలాషా బిస్ట్, సీ.వీ. ఆనంద్, ,మెడల్స్ గ్రహీతల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రెసిడెంట్ గ్యాలంటరీ పోలీస్ మెడల్స్, గ్యాలంటరీ పోలీస్ మెడల్స్, విశేష సేవలు అందించిన వారికి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్, ముఖ్యమంత్రి సర్వోన్నత పతకం, ముఖ్యమంత్రి మహోన్నత పతకం, శౌర్య పతకం, ఉత్తమ సేవా పతకాలను హోమ్ మంత్రి మహమూద్ అలీ, డీ.జీ.పీ. మహేందర్ రెడ్డి లు అందచేశారు. ఈ పతకాలను అందుకున్న వారిలో ముగ్గురు అడిషనల్ డీ.జీ.పీలు, ఇద్దరు ఐ.జీలు, ముగ్గురు డీ.ఐ.జీలు, ముగ్గురు ఎస్.పీ లతో పాటు 10 మంది నాన్ క్యాడర్ ఎస్.పీలు, 29 మంది అడిషనల్ ఎస్పీలు, 53 మంది డీ.ఎస్.పీలు, 48 మంది ఇన్స్పెక్టర్లు, 59 మంది ఎస్.ఐలు, 76 మంది ఏ.ఎస్.ఐ.లు, 87 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 47 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు.
No comments:
Post a Comment