Breaking News

09/01/2020

23వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు

అమరావతి జనవరి 9 (way2newstv.in)
రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన రైతుల ఆందోళనలు 23వ రోజుకు చేరాయి. తుళ్లూరు, వెలగపూడి, మందడం తదితర గ్రామాల్లో గురువారం ఉదయం నుంచే రైతులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు. 
23వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు

తుళ్లూరు ధర్నా చౌక్‌లో కొనసాగుతున్న దీక్షలకు సంఘీభావంగా దళిత జేఏసీ నాయకులు ఒక రోజు దీక్షకు సిద్ధమయ్యారు.మూడు రాజధానులు వద్దు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, ‘సేవ్‌ అమరావతి’ అంటూ రైతులు నినదించారు. మందడంలో రైతులు రోడ్డుపైనే టెంటు వేసుకుని దీక్ష కొనసాగిస్తున్నారు. జాతీయ జెండా, మోదీ ఫ్లెక్సీలతో పలువురు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ..  ప్రభుత్వం వద్ద డబ్బుల్లేకపోతే శ్రమదానంతో రాజధాని నిర్మించుకుంటామని స్పష్టం చేశారు.

No comments:

Post a Comment