తనుశ్రీ దత్తావివాదాస్పద వ్యాఖ్యలు
న్యూ ఢిల్లీ జనవరి 9 (way2newstv.in)
ఢిల్లీ లో ఏడేళ్ల కిందట నిర్భయను మృగాళ్లు అతి దారుణంగా రేప్ చేసి ఆమె చావుకు కారణమయ్యారు. ఈ మేరకు పటియాలా కోర్టు వీరికి డెత్ వారెంట్ జారీ చేసింది.అయితే ‘మీటూ’ పేరుతో బాలీవుడ్ లోని లైంగిక వేధింపులను ఎత్తిచూపి సంచలనం సృష్టించిన తనుశ్రీ దత్తా తాజాగా నిర్భయ నిందితులకు ఉరిపై చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి.తనుశ్రీ మాట్లాడుతూ ‘నిర్భయ నిందితులకు ఉరిశిక్ష తో న్యాయం జరగడం మంచిదే కానీ.. ఇలా రేప్ చేసిన వారిని ఎంత మందిని ఉరి తీసుకుంటూ పోతారు.. సరైన పరిష్కారం లభించాలి.. చావు అనేది పరిష్కారం కాదు..
రేప్ చేసిన ఎంత మందిని ఉరి తీస్తారు
అత్యాచారాలకు పుల్ స్టాప్ పడాలని కోరుకుంటున్నా’ అని వ్యాఖ్యానించారు.నిర్భయ నిందితులకు ఉరిపై అంతా హర్షం వ్యక్తం చేస్తుంటే తనుశ్రీ మాత్రం రేప్ నిందితులకు ఉరి పరిష్కారం కాదనడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమెపై ట్రోల్స్ చేస్తూ ఎండగడుతున్నారు. వారికి ఉరిశిక్ష పడాలని నిర్భయ తల్లి శాంతదేవి ఇప్పటికీ కోర్టుల చుట్టూ.. ప్రభుత్వం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎట్టకేలకు ఆరోజు వచ్చింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు నలుగురు నిందితులను తీహార్ జైల్లోని 3వ నంబర్ కారాగారంలో ఒకేసారి ఉరి తీయనున్నారు. ఈ మేరకు పటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.ఘటన జరిగిన తర్వాత ఏడేళ్లకు నిర్భయకు న్యాయం జరగుతుండడంతో ఆమె తల్లి హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అందరూ న్యాయం జరిగిందని అంటున్నారు.
No comments:
Post a Comment