Breaking News

22/01/2020

సామాజిక వర్గం కోసమే పట్టుపడుతున్నారా...

న్యూఢిల్లీ, జనవరి 22, (way2newstv.com)
రాజ‌ధానిని త‌ర‌లిస్తామంటే.. లేదా మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేస్తామంటే.. కాదంటూ.. చంద్రబాబు ఇప్పుడు రోడ్డెక్కారు. రాజ‌ధాని విష‌యంలో రాష్ట్ర ప్రజ‌ల‌ను ఏకం చేస్తాన‌ని చెప్పారు. అదే సమయంలో జోలెప‌ట్టారు. కేవ‌లం రాజ‌ధానిని ఒక చోట నుంచి ఒక చోట‌కు మార్చినంత మాత్రాన పెద్దగా ప్రజ‌లకు ఒరిగేదీ పోయేదీ ఏమీలేదు. కానీ, చంద్రబాబు మాత్రం ఈ విష‌యంలో ప‌ట్టు స‌డ‌ల‌ని విక్రమార్కుడి మాదిరిగా దూసుకుపోతున్నారు. మంచిదే ఎంచుకున్న విష‌యం ఎలాంటిదైనా ముందుకు పోవాల‌న్నా టాల్ స్టాయ్ మాట‌ను నిజం చేస్తున్నార‌ని అనుకుందాం.కానీ, ఇదే ఊపు ఉత్సాహం కేంద్రంపై ఎందుకు చూపించ‌లేక పోయారు. 
సామాజిక వర్గం కోసమే పట్టుపడుతున్నారా...

ఐదు కోట్ల మంది బ‌తుకుల‌కు సంబంధించిన ప్రత్యేక హోదా విష‌యంలో చంద్రబాబు ఏం చేశారు? అప్పట్లో కూడా ప్రజ‌ల‌ను ఇలానే గ‌ట్టిగా కేంద్రంపై విమ‌ర్శలు చేయించి, ఆందోళ‌న‌ల‌తో అట్టుడిగిపోయేలా చేసి ఉంటే బాగుండేది క‌దా? హోదా ద‌క్కి ఉండేది అనేది నేటి వాద‌న‌. కానీ, నాడు ప్యాకేజీ అన‌గానే చంక‌లు ఎగ‌రేసుకుని త‌లాడించారు. పోనీ అది అయినా ద‌క్కిందా? అంటే ప్యాకేజీ కూడా ద‌క్కలేదు.నాడు ప్యాకేజీ విష‌యంలో కొంత ఇచ్చి కొంత ఇవ్వకుండానే మోడీ స‌ర్కారు మౌనం పాటించింది. ఇక‌, ఎన్నిక‌లు ముంచుకువ‌చ్చే స‌రికి త‌గుదున‌మ్మా అంటూ మ‌ళ్లీ హోదా అన్నారు. ఈ క్రమంలో కోట్ల కు కోట్లు ఖ‌ర్చు చేసి దీక్షలు చేప‌ట్టారు. కానీ, ప్రజ‌ల్లో విశ్వాసాన్ని మాత్రం ప్రోదిచేలేక పోయారు. అయితే, ఇప్పుడు ఇంత భారీగా జ‌రుగుతున్న అమ‌రావ‌తి ఉద్యమానికి వెనుక చంద్రబాబుపై ఓ సామాజిక వ‌ర్గం ఒత్తిడి బాగా ప‌నిచేస్తోంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఓ సామాజిక వ‌ర్గానికి చెందిన ఆస్తులు ఇక్కడ పోగుప‌డ‌డం, అదే సామాజిక వ‌ర్గం భూములు కొనుగోలు చేయ‌డం, వారే చంద్రబాబు పార్టీని అధికారంలోకి వ‌చ్చేందుకు సాయ‌ప‌డ్డార‌నే వ్యాఖ్యలు ఉండ‌డం నేప‌థ్యంలో ఇప్పుడు వారికోస‌మే చంద్రబాబు ఇంత చేస్తున్నార‌ని అంటున్నారు త‌ట‌స్థులు. మ‌రి ఇది నిజ‌మేనా? అని అనిపించేలా ఎప్పుడు కూడా ఇంటి నుంచి బ‌య‌ట‌కురాని.. ఓ సామాజిక‌వర్గం మ‌హిళ‌లు ఇప్పుడు రోడ్డెక్కారు. దీంతో అమ‌రావ‌తి రాజ‌ధాని ఉద్యమంపై అనేక సందేహాలు ముసురుకున్నాయి

No comments:

Post a Comment