న్యూఢిల్లీ, జనవరి 21, (way2newstv.in)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. బుధవారం ఆయన హస్తినకు చేరుకోనున్నారు.. అక్కడ బీజేపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొనున్నారు. భవిష్యత్ కార్యాచరణతో పాటూ పొత్తుకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. మిత్రపక్షాలుగా రాష్ట్రంలో ఎలా ముందుకు సాగాలనే అంశంపైనే ప్రధానంగా ఈ సమావేశంలో ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.ఈ సమన్వయ కమిటీ సమావేశంలో ప్రధానంగా రాజధాని అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది.
ఢిల్లీకి పవన్.. టార్గెట్ జగన్ సర్కార్
మూడు రాజధానులపై జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో.. ప్రజల్లోకి ఎలావెళ్లాలి.. చేపట్టాల్సిన ఆందోళనలపై చర్చించనున్నారు. అమరావతికి రెండు పార్టీలు జైకొట్టాయి.. కాబట్టి ఉమ్మడిగా కార్యాచరణను రూపొందించే ఆలోచనలో ఉన్నారట. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. కాబట్టి అక్కడే అన్ని అంశాలపై చర్చించనున్నారు.జనసేన-బీజేపీ మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. రెండు పార్టీలు ఇక కలిసి ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఎన్నికల్లో కలిసి పోటీచేయాలనే తీర్మానించారు. 10 రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లారు.. బీజేపీ పెద్దల్ని కలిశారు. అనంతరం విజయవాడలో బీజేపీ నేతలతో కలిసి చర్చలు జరిపి పొత్తులు ఖాయం చేశారు. ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించి తమ నిర్ణయాన్ని ప్రకటించారు.
No comments:
Post a Comment