నిజామాబాద్, జనవరి 22, (way2newstv.in)
జిల్లాలోని ఆధార్ కేంద్రాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బీడీ కార్మికుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ వివరాలను మార్పిడి చేస్తూ ఒక్కొక్కరి వద్ద రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూల్ చేసి రూ.లక్షల్లో దండుకుంటున్నారు. బీడీ కార్ఖానా నిర్వాహకులతో చేతులు కలిపి ‘మాఫియా’గా తయారై రహస్యంగా ఈ అక్రమ దందాను సాగిస్తున్నారు. నిరక్ష్యరాస్యత, అవగాహన లేక చాలా మంది బీడీ కార్మికులు తమ పీఎఫ్ ఖాతాల్లో ఒకలా, ఆధార్‌లో మరోలా పుట్టిన తేదీ నమోదు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో పీఎఫ్ ఖాతాకు అనుగుణంగా ఆధార్‌లో పుట్టిన తేదీని మార్పు చేసుకోవాలని కార్ఖానా నిర్వహకులు, పీఎఫ్ అధికారులు చెబుతున్నారు. లేకపోతే పీఎఫ్ పింఛన్‌తో పాటు రాజీనామా చేసినప్పుడు డబ్బులు వచ్చే సమయంలో ఇబ్బందులు పడుతారని చెప్పడంతో కార్మికులు గందరగోళానికి గురయ్యారు.
జిల్లాల్లో ఆధార్ దందాలు
ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, పేరు మార్చేందుకు తొలుత బీడీ కార్ఖానా నిర్వాహకులే దళారులుగా మారారు. తమకు తెలిసిన ఆధార్ కేంద్రాల నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకున్నారు. ఆధార్‌లో పుట్టిన తేదీ మార్చినందుకు రూ.1500 నుంచి రూ.2 వేల వరకు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.అయితే, కార్ఖానా నిర్వాహకులు కూడా ఇదే అదనుగా అనుకుని బీడీ కారి్మకుల నుంచి పెద్ద మొత్తంలో గుంజుతున్నారు. పేరు, పుట్టిన తేదీ మార్పు కోసం రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేసినట్లు కారి్మకులు చెప్తున్నారు. ఇలా వసూలు చేసిన మొత్తంలో రూ.2 వేలు ఆధార్ కేంద్రాల నిర్వాహకులకు ఇచ్చి, మిగతా డబ్బులు వారి జేబుల్లో వేసుకున్నట్లు తెలిసింది. ఇలా జిల్లా మొత్తంగా కొన్ని వేల మంది కారి్మకుల నుంచి ఆధార్, బీడీ కార్ఖానా నిర్వాహకులు అందిన కాడికి దండుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 64 ఆధార్ కేంద్రాలు ఉన్నా, అందులో కొందరు నిర్వాహకులు మాత్రమే నిబబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్‌పల్లి మండలాల్లోనే ఈ అక్రమ దందా జోరుగా సాగుతోందని సమాచారం. జిల్లా వ్యాప్తంగా తమకు తెలిసిన కార్ఖానా నిర్వాహకులతో చేతులు కలిపిన ఆయా కేంద్రాల నిర్వాహకులు.. రోజుకు కొంత మంది చొప్పున ఆటోల ద్వారా ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్‌పల్లి ప్రాంతాలకు తీసుకువచ్చి ఆధార్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. అయితే, ఆధార్ కేంద్రాల్లో చేస్తే విషయం బయటకు పొక్కుతుందని జాగ్రత్త పడిన ఆపరేటర్లు.. ఎవరికీ తెలియకుండా రహస్య ప్రాంతాలు, ఊరి చివరి ఇళ్లలో ఆధార్ కిట్లు పెట్టి నమోదు చేశారు. వాస్తవానికి కేంద్రాన్ని విడిచి ఆధార్ కిట్లు బయట ప్రాంతాలకు తీసుకెళ్లొద్దు.కానీ కిట్లను బయట ప్రాంతాలకు తీసుకువచ్చి అటవీ ప్రాంతాల్లో నమోదు చేయడం గమనర్హం. బీడీ కార్మికులకు కూడా ఆటోలో ఎక్కడి తీసుకెళ్తున్నారో సమాచారం ఇవ్వడం లేదు. తీసుకెళ్లిన వారిని గదిలో పెట్టి బటయకు రాకుండా పని కానిచ్చేస్తున్నారు. ఈ మ్‌గల్, ఆర్మూర్, నందిపేట్ ప్రాంతాల్లో కూడా ఇలాంటి దందానే గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. ఈ భైంసా నుంచి కూడా వచ్చి ఆధార్‌లో పుట్టిన తేదీని మార్చుకుని వెళ్తున్నారంటే మన జిల్లాలో అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
No comments:
Post a Comment