Breaking News

23/01/2020

మాది ఫార్మర్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వం: మంత్రి హరీష్‌ రావు

హైదరాబాద్‌ జనవరి 23 (way2newstv.in):
: బంజారా హిల్స్‌ లో నాబార్డు రాష్ట్ర రుణ ప్రణాళిక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ రావు హాజరయ్యారు. ఈ సదస్సులో ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ మయా, ఆంధ్రా బ్యాంక్‌ ఈడీ కుల్‌భూషణ్‌, నాబార్డు సీజీఎం విజయ్‌కుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. 
మాది ఫార్మర్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వం: మంత్రి హరీష్‌ రావు

నాబార్డు స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ 2020-21ని మంత్రి హరీష్‌ రావు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ స్వయంగా రైతు కాబట్టే.. రైతుల సమస్యలు ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఫార్మర్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వమని మంత్రి స్పష్టం చేశారు. గోదాముల నిర్మాణం, సూక్ష్మ సేద్యానికి నాబార్డు అండగా నిలిచిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్‌తో రైతులకు భరోసా ఇచ్చామని హరీష్‌ రావు పేర్కొన్నారు.

No comments:

Post a Comment