Breaking News

30/01/2020

యవతకు పెద్ద పీట

విజయవాడ, జనవరి 30, (way2newstv.in)
సైకిల్ గత ఎన్నికల తరువాత నుంచి చతికిల పడుతూ వస్తూనే ఉంది. దశాబ్దాల తరబడి చక్రం తిప్పుతున్న వృద్ధ నాయకత్వం పసుపు పార్టీకి శాపంగా మారిపోయింది. అంది వస్తాడనుకున్న యువనేత నారా లోకేష్ తానే ప్రత్యక్ష ఎన్నికల్లో స్వయంగా పరాజయం పాలు కావడం తెలుగుదేశాన్ని మరింత నీరస పడేలా చేసింది. దీనికి తోడు టిడిపి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 23 మంది ఎమ్యెల్యేలుగా ముగ్గురే ఎంపీలుగా ఎన్నిక కావడం తో శ్రేణులు డీలా పడిపోయాయి. తన అనుభవాన్ని అంతా రంగరించి వృద్ధ నేత అయినా యువకులకు తీసిపోని విధంగా ఏడు పదుల వయసుకు చేరుకున్న చంద్రబాబు అలుపెరగని పోరాటం సాగిస్తూ వస్తున్నారు. 
 యవతకు పెద్ద పీట

ఈ దశలోనే పార్టీ లో అసంతృప్తి రాజుకుని ఇద్దరు ఎమ్యెల్యేలు ఇప్పటికే దూరం జరిగారు. అలాగే ఎమ్మెల్సీ లు ఒక్కరొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు.ఒక పక్క అధికార పక్షంపై పోరాటం మరోపక్క పార్టీని కాపాడుకోవడం చంద్రబాబుకు కత్తిమీద సాముగా మారింది. ఇదే సమయంలో పార్టీ ప్రక్షాళనకు సమయం ఆసన్నం అయ్యిందన్న టాక్ సీనియర్ల నుంచే మొదలైపోయింది. లోకేష్ ను పక్కన పెట్టి యువరక్తం ఎక్కించేందుకు అధినేత దృష్టి పెట్టకపోతే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని టిడిపి లో కొందరి ఆందోళన. పార్టీ పదవుల నుంచి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వరకు యువతకు పెద్ద పీట వేయకపోతే కష్టమే అని అధినేతకు నేరుగా కొందరు చెప్పినట్లు తెలుస్తుంది.చంద్రబాబు యువ నాయకత్వాన్ని గుర్తించే బాధ్యతలను కొందరు సీనియర్లకు అప్పగించారని తెలుస్తుంది. అయితే యువనాయకత్వం అంటే తమ వారసులను తెరపైకి తేవడం కాదని సమర్థులను గుర్తించి బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు స్పష్టం చేశారని అంటున్నారు. ఇలా చేస్తే మరి స్థానికంగా బలంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు దీనికి ఏ మేరకు సహకరిస్తారన్నది చూడాల్సి ఉంది. దీంతో పాటు కొత్త యువనేతలు వస్తే వారికి పార్టీ సీనియర్ నేతలు కూడా ముఖం చాటేసే అవకాశముంద. మరి తమ్ముళ్ళు ఏమి చేస్తారో చూడాలి.

No comments:

Post a Comment