Breaking News

30/01/2020

ఏపీ తరహాలో జార్ఖాండ్ క్యాపిటల్స్

రాంచీ, జనవరి 30, (way2newstv.in)
జగన్ వి తుగ్లక్ చర్యలని, ఆయన పాలన దుర్మార్గమని తెల్లారిలేస్తే చంద్రబాబు ఆయన గ్యాంగ్ ఆడిపోసుకుంటారు. ఆయనది రివర్స్ పాలన అని కూడా అంటారు. మరి జగన్ పాలన బాగుందని, ఒక జాతీయ సంస్థ సర్వేలో నాలుగవ ర్యాంక్ వచ్చింది. మరో వైపు దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఏపీ వైపు చూస్తున్నారు. దిశ చట్టం గురించి ఎందరో సీఎంలు ఏపీ సర్కార్ని వాకబు చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రైవేట్ విద్యుత్ ఒప్పందాలను జగన్ సమీక్షిస్తే తమ్ముళ్ళు గగ్గోలు పెట్టారు. అదే పనిని భారతీయ జనతా పార్టీకి చెందిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ కూడా చేస్తే నోరు మెదపలేకపోయారు. ఇపుడు అలాంటిదే మరో నిర్ణయం విషయంలో జగన్ని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అనుసరించబోతున్నారు.
 ఏపీ తరహాలో జార్ఖాండ్ క్యాపిటల్స్

ఈ మధ్యనే జరిగిన జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ సర్కార్ ని అధికారం నుంచి దించేసి మరీ గెలిచిన హేమంత్ సోరేన్ కాంగ్రెస్ తో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన తాజాగా జగన్ తరహాలోనే కొత్త రాజధానులను తన రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారుట. ఇప్పటికి రాంచీ ఒక రాజధానిగా ఉంటే దానికి తోడుగా మరో నాలుగు చోట్ల రాజధానులను ప్రకటించాలని హేమంత్ ఆలోచిస్తున్నారుట. దీని వల్ల అభివృధ్ధి వికేంద్రీకరణ జరిగి పాలన మరింతగా జనాలకు చేరుతుందని హేమంత్ భావిస్తున్నారుట. అలాగే వెనకబాటుతనంతో ఉన్న గిరిజన ప్రాంతాలు కూడా వెంటనే అభివృధ్ధిని సాధిస్తాయని ఆయన అంచనా వేస్తున్నారుట.తాము ఉత్తరాది రాష్ట్రాలతో ఏ విధంగానూ పోటీ పడలేకపోతున్నామని హేమంత్ సోరెన్ అంటున్నారు. జార్ఖండ్ లో ఆదీవాసులు అన్ని విధాలుగా వెనకబడిఉన్నారని ఆయన అంటున్నారు. వారిని ప్రగతిపధంలో నడిపించాలంటే రాజధానుల సంఖ్య పెంచడమే అసలైన పరిష్కారమని కూడా ఆయన చెబుతున్నారు. దుమ్కా మేదినినగర్ ఛైబాస గిరిధ్ ప్రాంతాలను రాజధానులను బదలాయించడానికి జార్ఖండ్ ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. దీని మీద తొందరలోనే నిర్ణయం తీసుకోవాలని హేమంత్ ఆత్రపడుతున్నారు.ఏపీలో మూడు రాజధానులు పెడితేనే ఆకాశం భూమి కలిపేసిన తెలుగుదేశం, విపక్షాలు జార్ఖండులో అయిదు పెడుతున్నారు. మరి దానికి ఏం సమాధానం చెబుతారో అని వైసీపీ నేతలే అంటున్నారు. అంతే కాదు, ఏపీలో మూడు రాజధానుల విషయంలో కాంగ్రెస్ కూడా అడ్డుపుల్లలు వేసింది. ఇపుడు ఆ పార్టీ జార్ఖండ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నది. హేమంత్ సీఎం గా నిర్ణయిస్తే తలూపడమే తప్ప కాంగ్రెస్ ఏం చేయలేదు. అలాంటిది ఏపీలో మాత్రం హస్తం పార్టీ వద్దు వీల్లేదంటోంది. మొత్తానికి జగన్ నిర్ణయాలు ముందు చూపుతో తీసుకుంటున్నవని ఇతర రాష్ట్రాలు గుర్తిస్తున్నాయి కానీ సొంత రాష్ట్రంలో మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనక మతలబు ఒక్కటే, ఇక్కడ తెలుగుదేశంతో పాటు, ఒక బలమైనా మీడియా గట్టిగా యాగీ చేయడం వల్లనే జనాలకు వాస్తవాలు తెలియడంలేదని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ మూడు రాజధానుల నిర్ణయం భేష్ అని హేమంత్ వంటి వారు చెప్పేస్తున్నారు. మేమూ మీ బాటలోనే అంటున్నారు. మిగిలిన రాష్ట్రాలు రేపో మాపో ఇదే బాటన నడుస్తాయేమో.

No comments:

Post a Comment