విజయవాడ, జనవరి 30, (way2newstv.in)
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటుతుంది. మంత్రులు కూడా బాధ్యతలను స్వీకరించి ఏడు నెలలు కావస్తుంది. అయితే వైసీపీ మంత్రుల్లో ఎక్కువ మంది ఉత్సాహంగా లేరు. తమ శాఖకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోలేకపోవడం, పట్టు సాధించలేకపోవడం వల్లనే మంత్రుల్లో అనేక మంది నిరుత్సాహంగా ఉన్నారని చెబుతున్నారు. నిజానికి ఇప్పుడున్న మంత్రుల్లో 95 శాతం మంది రెండున్నరేళ్లు మాత్రమే ఉంటారు.ఇది ముఖ్యమంత్రి జగన్ చెప్పిన విషయమే. సీఎల్పీ సమావేశంలో రెండున్నరేళ్లు మాత్రమే మంత్రిపదవుల్లో ఉంటారని, మరో రెండున్నరేళ్లకు కొత్తవారు క్యాబినెట్ లో వచ్చి చేరతారని చెప్పారు. అవినీతి చేస్తే సహించమని కూడా జగన్ హెచ్చరించారు.
శాఖల్లో కనిపించని పురోగతి
అయితే ఇప్పుడు మంత్రి పదవులు చేపట్టి ఏడు నెలలు దాటుతునా తొలి దఫాలో తమకు ఎందుకు వచ్చిందన్న ఆందోళన, ఆవేదన అనేక మంత్రుల్లో కన్పిస్తుండటం విశేషం. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి.మంత్రి పదవి అనగానే జిల్లాల మీద పెత్తనంతో పాటు తన శాఖకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంటుంది. అయితే ఏడు నెలలుగా అది జరగడం లేదు. జగన్ కేవలం నవరత్నాలు, పాదయాత్రలో తాను ఇచ్చిన హామీల అమలుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం, రాజధాని అమరావతి వంటి సమస్యలతో పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. మంత్రివర్గ సమావేశాలు నెలకు రెండుసార్లు జరుగుతున్నా వాటిలో ప్రధానంగా తమ శాఖలకు సంబంధించిన పురోగతి లేదన్నది కొందరి మంత్రుల ఆవేదన.అలాగే తొలిదఫా మంత్రివర్గంలోకి రావడంతో స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతను కూడా నెత్తికెత్తుకోవాల్సి వచ్చింది. ఇటు తమ సొంత నియోజకవర్గంతో పాటు ఇన్ ఛార్జి మంత్రిగా ఉన్న జిల్లాలను కూడా పర్యవేక్షించుకోవాల్సి వస్తుంది. రిజల్ట్ లో తేడా వస్తే అందుకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. సంక్షేమ పథకాలు ఎన్ని ప్రవేశపెట్టినా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారన్న ఆందోళనలో మంత్రులయితే ఉన్నారు. ఇప్పటికే వన్ ఇయర్ సమస్యలు, ఎన్నికలతోనే ముగుస్తుందన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది
No comments:
Post a Comment