Breaking News

25/01/2020

గద్వాలలో నైతిక విజయం బీజేపీ దే:డికే.అరుణ

గద్వాల జనవరి 25 (way2newstv.in)
గద్వాలలో నైతిక విజయం బీజేపీ దేనని బిజెపి నేత మాజీ మంత్రి డికే అరుణ అన్నారు.మున్సిపల్ ఎన్నికల పలితాల పై ఆమె స్పందిస్తూ గద్వాలలో గెలుపు ఓటములకు అదేర్య పడే అవసరం లేదు.నైతికంగా మనం గెలిచాము...పెద్దఎత్తున ఓట్లశాతం పెరిగింది.తెరాసపార్టీ పెద్దఎత్తున  అధికార దుర్వినియోగం చేసినాతెరాస కు తగ్గిన ఓట్లశాతం.
గద్వాలలో నైతిక విజయం బీజేపీ దే:డికే.అరుణ

ఈ ఎన్నికల్లో తెరాస స్థానికేతరులతో అన్నీ వార్డుల్లో భయ భ్రాంతులకు గురిచేసి డబ్బు,మద్యం తో ప్రభావితం చేసింది అయినా ప్రజల్లో మనపై విశ్వాసం ఉందన్న వాస్తవం ఓట్ల శాతం ద్వారా తెలియచేశారు.ఇకపై మనం అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపి ,ప్రజాహితం కోసం పోరాడుదాం.ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం యుద్ధం చేద్దాం.ప్రజలు మనల్ని తిరస్కరించలేదు.నైతికంగా గెలిపించారు.తెరాస కు తగ్గిన ఓట్ల శాతం తో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

No comments:

Post a Comment