హైదరాబాద్ జనవరి 25 (way2newstv.in)
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగింది. దేశంలోనే ఏ పార్టీ సాధించని ఫీట్ ను సాధించి టీఆర్ఎస్ పార్టీ ‘నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్’ అనేసింది. మధ్యాహ్నం 3 గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం.. తెలంగాణ లోని మొత్తం 120 మున్సిపాలిటీల లో ఏకంగా 109 స్థానాల్లో గెలిచి దేశం లోనే సంచలనం సృష్టించింది. ఇక మొత్తం 8 కార్పొరేషన్ల లో 8 స్థానాలను కైవసం చేసుకొని విజయ దుందుభి మోగించింది. దేశ చరిత్ర లోనే ఒక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంతటి ఏకపక్ష విజయం లేదని టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం
తెలంగాణ వ్యాప్తం గా వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 120 మున్సిపాలిటీలకు గాను టీఆర్ఎస్ ఏకంగా 109 స్థానాలను కైవసం చేసుకొని ఎన్నికల చరిత్ర లోనే సంచలనం సృష్టించింది. ఇక కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎంలు గులాబీ పార్టీ ధాటికి కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి.కాంగ్రెస్ 4 మున్సిపాలిటీలను బీజేపీ 3 బల్దియాలను ఎంఐఎం 1 ఇతరులు 2 స్థానాలను కైవసం చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తం గా అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్లలో స్పష్టమైన గులాబీ పార్టీ ఆధిక్యం కనిపిస్తోంది. తెలంగాణ లో తమకు తిరుగులేదని టీఆర్ఎస్ నిరూపించింది.కాంగ్రెస్ ఉద్దండ పిండాలైన రేవంత్ రెడ్డి మల్లు భట్టి ఉత్తమ్ ఇలాఖాలోనూ కారు జోరు కొనసాగడం విశేషం.దేశ చరిత్ర లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో 90శాతం ఫలితాలు సాధించిన ఏకైక పార్టీగా టీఆర్ఎస్ నిలవడం గులాబీ పార్టీ శ్రేణులను మరింత ఉత్సాహ పరిచింది. దేశంలోనే ఏ ప్రాంతీయ జాతీయ పార్టీకి ఇంతటి అరుదైన ఫీట్ సాధ్యపడలేదని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. ఈ నేపథ్యం లోనే సాయంత్రం గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ మీడియా ముందుకు వస్తున్నారు.
No comments:
Post a Comment