Breaking News

21/01/2020

దావోస్ నుంచి పోలింగ్ వ్యూహాలు...

కేటీఆర్ దిశానిర్దేశం
హైద్రాబాద్, జనవరి 21, (way2newstv.in)
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ అక్కడి నుంచి నేతలకు ఫోన్‌లో పలు కీలక సూచనలు చేశారు. పోలింగ్ వ్యూహం గురించి చర్చించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పట్టణాలు, నగరాల అభివృద్ధి కోసం ప్రజలు తమ పార్టీకే పట్టం కట్టనున్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో పార్టీకి ప్రజాభిమానం వెల్లువెత్తుతుందన్న ఆయన.. టీఆర్ఎస్‌కు తెరాసకు అత్యంత సానుకూల వాతావరణం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.అయితే, ఎన్నికల్లో చివరి క్షణం వరకూ అంతా అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. 
దావోస్ నుంచి పోలింగ్ వ్యూహాలు...

ఇప్పటివరకూ అందరూ బాగా పని చేశారని, 22న పోలింగ్ ముగిసే వరకు ఇదే పద్ధతిలో పని చేయాలని సూచించారు. పార్టీ అభ్యర్థులే గెలిచేలా కృషి చేయాలని ఆదేశించారు. ఎన్నికలకు మరో రెండురోజులే గడువు ఉందని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో అద్భుతంగా పనిచేశారని కేటీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులను అభినందించారు.పార్టీ సమన్వయకర్తలు స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో మాట్లాడి పోలింగ్ కేంద్రాల వారీగా ఏజెంట్ల జాబితా తెప్పించాలని కేటీఆర్ సూచించారు. వారితో మంగళవారం సమావేశాలు నిర్వహించి సూచనలివ్వాలి. ప్రతి ఓటూ విలువైనదిగానే పరిగణించాలని, ఇందులో ఏ మాత్రం నిర్లక్ష్యం పనికిరాదని అన్నారు. ఓటమి భయంతో ప్రతిపక్షాలు అవాంఛనీయ చర్యలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించిన కేటీఆర్.. వీటిని మన నాయకులు ఎప్పటికప్పుడు గుర్తించి, వాటి గుట్టురట్టు చేయాలని సూచించారు. మన ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే చక్కటి అభివృద్ధి సాధించే వీలుందని అన్నారు.

No comments:

Post a Comment