Breaking News

09/01/2020

రాజధాని మార్పు: చంద్రబాబు కొత్త వ్యూహం?

గుంటూరు జనవరి 9  (way2newstv.in)
అమరావతి రాజధానిని మార్చడం.. మూడు రాజధానులపై జగన్ ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీ నిర్ణయం ప్రకటించగానే టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోవాలని స్కెచ్ వేసినట్టు తెలిసింది.అమరావతికి మద్దతుగా ఉద్యమాన్ని లేవదీస్తున్న చంద్రబాబు.. ఈ రాజకీయ అనిశ్చితిని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి కొత్త వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.అమరావతి రైతులు రోడ్డెక్కుతున్నారు. వారి మద్దతుగా చంద్రబాబూ రోడ్డున పడ్డారు. ఆందోళన చేస్తున్నారు. అయినా జగన్ సర్కారు రాజధాని మార్చేసి విశాఖకు మకాం మార్చడానికి రెడీ అవుతోంది. మరి ఇంకేం చేయాలి.. రాజకీయంగా తీవ్రఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రతిపక్ష చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. 
రాజధాని మార్పు: చంద్రబాబు కొత్త వ్యూహం?

ఉత్తరాంధ్ర సీమ వారి నుంచి నిరసన ఎదుర్కొంటున్న బాబు రాజకీయంగా నష్టమైనా సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ పై బ్రహ్మాస్త్రం వేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోగానే చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామా చేయాలని మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఈ దెబ్బతో ప్రజల్లో మంచి పేరుతో పాటు.. ప్రభుత్వం పై ఒత్తిడి పెరుగుతుందని చంద్రబాబు ప్లాన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం టీడీపీ లోని ఎమ్మెల్యేలు ముఖ్యులతో చంద్రబాబు సంప్రదింపులు జరుపుతున్నారట.. అయితే ఈ విషయం లో ఉత్తరాంధ్ర సీమ ఎమ్మెల్యేలు కలిసి వస్తారా రారా అన్నది బాబును ఇబ్బంది  పెడుతోంది. మరి బాబు ప్రతి పాదనకు ఉత్తరాంద్ర సీమ ఎమ్మెల్యేలు ఎంతమంది రాజీనామా చేస్తారన్నది వేచిచూడాలి.మరి బాబు వేసిన ఈ స్కెచ్ కు జగన్ సర్కారు ఇరకాటంలో పడుతుందా లేక ధీటుగా తిప్పుకొడుతుందా అన్నది ఆసక్తిగా మారింది.

No comments:

Post a Comment