జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు
నిర్మల్ జనవరి 9 (way2newstv.in)
పోలీస్ అధికారులకు పదోన్నతులతో పాటు బాధ్యతలు కుడా పెరుగుతాయని ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. నిర్మల్ ఆర్మూడ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఏడు మంది హెడ్ కానిస్టేబుళ్లు ఎ.ఆర్.ఎ.ఎస్.ఐగా పదోన్నతి పోందారు. పదోన్నతి పోందినవారిలో పి.భీమ్ రావు, ఎ.రాములు, కే.విఠల్, ఐ.సోనియా, పి.యువరాజ్, బి.రమేష్, సంతోష్ రెడ్డి వున్నారు.
పదోన్నతులతో పాటు బాధ్యతలు పెరుగుతాయి
ఈ సందర్బంగా పదోన్నతి పోందిన పోలీస్ అధికారులు గురువారం జిల్లా ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలుసుకోని పుష్పాగుచ్చాలు అందజేసారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ అధికారులు అప్పగించిన పనులు సక్రమంగా నిర్వర్తిస్తూ విధుల్లో రాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమములో అదనపు ఎస్పీ లు శ్రీనివాస్ రావు, వెంకట్ రెడ్డి, అర్.ఐ వెంకటి పాల్గోన్నారు.
No comments:
Post a Comment