Breaking News

23/01/2020

శాసనమండలిని రద్దు చేసైనా తాము ముందుకెళ్తాం: మంత్రి బొత్స

అమరావతి జనవరి 23 (way2newstv.in):
ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దుపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసన మండలి చైర్మన్‌ షరీఫ్‌ తన విచక్షణాధికారాల్ని వినియోగించి రాజధాని బిల్లుల్ని సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చర్యను అధికార వైసీపీ తీవ్రంగా నిరసిస్తోంది. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో నేడు మాట్లాడుతూ.. తొత్తుల్ని తీసుకొచ్చి ఉన్నతస్థానంలో కూర్చోబెట్టారు. 
శాసనమండలిని రద్దు చేసైనా తాము ముందుకెళ్తాం: మంత్రి బొత్స

అందుకే మండలి రద్దు ఆలోచన చేయాల్సి వస్తోందన్నారు. నిబంధనలు పాటించాలని చెప్పినా చైర్మన్‌ పాటించలేదన్నారు. జరుగుతున్న పరిణామాలు, ప్రస్తుత పరిస్థితులనుబట్టీ ఇలాంటి వ్యవస్థ ఉండాలా లేదా అన్న చర్చే సర్వత్రా ఇప్పుడు నడుస్తోందన్నారు. ఉన్నత పదవుల్లో తాబేదార్లను కూర్చోబెట్టే వ్యవస్థపై చర్చ జరగాలన్నారు. శాసనమండలి రద్దుపై చట్టపరంగా ఆలోచన చేయనున్నట్లు తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తాము ముందుకెళ్తామని పేర్కొన్నారు.

No comments:

Post a Comment