Breaking News

23/01/2020

రెడ్ బస్ తో మెట్రో ప్రయోగం

హైద్రాబాద్, జనవరి 23 (way2newstv.in):
ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సంస్థ రెడ్ బస్‌తో జత కట్టి ప్రయాణికుల కోసం కార్‌ పూలింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. హైదరాబాద్‌ మెట్రో రైలు కారిడార్‌లో ఫస్ట్‌, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీలో భాగంగా మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికుల వసతులకు తగ్గట్టుగా కారు సేవలను అందిస్తారు. దీనిని హెచ్‌ఎంఆర్ అధికారులు, రెడ్ బస్ ప్రతినిధులు ప్రారంభించారు. ఈ విధానంలో ప్రయాణం కిలో మీటరుకు రూ.2తో ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు.మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి దేశంలోని అన్ని నగరాల్లో ట్రాఫిక్, కాలుష్యం పెద్ద సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా రవాణా వినియోగం పెంచాల్సిన అవసరం ఉందన్న ఆయన కేవలం 35 శాతం మంది జనాభా మాత్రమే నగరాల్లో ఉందని అన్నారు.
 రెడ్ బస్ తో మెట్రో ప్రయోగం

కానీ, హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో కిలో మీటర్ ప్రయాణానికి 45 నిమిషాల సమయం కూడా పడుతోందని గుర్తు చేశారు. రెడ్‌ బస్ భాగస్వామ్యంతో ఆర్ పూల్ సర్వీసులు ప్రారంభిస్తున్నామని.. నగరవాసులు ఈ సేవలు ఉపయోగించుకుని ట్రాఫిక్, కాలుష్య సమస్యలు అరికట్టడంలో సహకరించాలని కోరారుమెట్రోకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుండడంతో నివాస ప్రాంతాలు, పనిచేసే కార్యాలయాల నుంచి మెట్రో స్టేషన్‌లకు చేరుకునేందుకు వీలుగా రెడ్‌ బస్‌ సంస్థ ఆర్ పూల్ పేరుతో కారు పూలింగ్‌ సేవలను ప్రారంభించింది. హైటెక్‌ సిటీలో ఈ సేవలను మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ప్రారంభించారు. ఇప్పటి వరకు దేశంలోని ప్రధాన పట్టణాల మధ్య తిరిగే దూర ప్రాంత బస్సుల సేవలను అందిస్తున్న రెడ్‌ బస్‌ సంస్థ కారు పూలింగ్‌ సేవలను మెట్రో ప్రయాణికుల కోసం అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే పలు ప్రైవేటు రవాణా సంస్థలతో పాటు, కొన్ని ఐటీ కంపెనీలు, మెట్రో షటిల్‌ సర్వీసుల పేరుతో మినీ బస్సులను నడుపుతున్నారు. అదేవిధంగా ఓలా, ఉబర్‌ వంటి సంస్థలు క్యాబ్‌ సేవలను ఆయా మెట్రో స్టేషన్‌ల నుంచి అందిస్తున్నాయి. తాజాగా రెడ్‌ బస్‌ సైతం కారు పూలింగ్‌ సేవలను ప్రారంభించనుంది.

No comments:

Post a Comment