Breaking News

03/01/2020

1300 కోట్లకు ఉపాధి పనులు

వరంగల్, జనవరి 3, (way2newstv.in)
ఉపాధి హామీ పథకంలో కూలీలకు కల్పించే పని దినాలకు, ఈ స్కీమ్‌‌‌‌లో చేపట్టే మెటీరియల్ వర్క్స్‌‌‌‌కు మధ్య పొంతన లేకుండా పోతోంది. గ్రామాల్లో ఈజీఎస్‌‌‌‌ నిధులతో చేపట్టే వైకుంఠధామాలు, సీసీ రోడ్లు, గ్రామపంచాయతీ భవనాలు, గోదాములు, ఆట స్థలాల నిర్మాణానికయ్యే వ్యయానికి అనుగుణంగా ఫీల్డ్‌‌‌‌ అసిస్టెంట్లు, ఏపీఓలు కూలీలకు పని దినాలు కల్పించకపోతున్నారు. దీంతో మెటీరియల్‌‌‌‌ వర్క్స్‌‌‌‌కు నిధుల మంజూరుకు సాంకేతికంగా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పనులు చేసిన సర్పంచ్‌‌‌‌లు, చిన్న కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలోని రూల్స్ ప్రకారం 60 శాతం నిధులు కూలీల వేతనాలకు, 40 శాతం నిధులను మెటీరియల్‌‌‌‌ వర్క్స్‌‌‌‌కు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. 
1300 కోట్లకు ఉపాధి పనులు

ఉదాహరణకు కూలీలు వారు చేసిన పని దినాలకు రూ.150 కోట్లు(60 శాతం) వేతనంగా పొందినప్పుడే.. మెటీరియల్‌‌‌‌ వర్క్స్‌‌‌‌ చేయడానికి అదే రేషియోలో రూ.100 కోట్లు(40 శాతం) మంజూరవుతాయి. ఈ నిధులను కూలీలతో సంబంధం లేకుండా మౌలిక వసతుల కల్పనకు వినియోగించవచ్చు. ఇలా కూలీలకు ఎంత ఎక్కువ పని దినాలు కల్పిస్తే మెటీరియల్‌‌‌‌ వర్క్స్‌‌‌‌కు అంత ఎక్కువ నిధులు మంజూరయ్యే అవకాశముంది. ఒకవేళ కూలీలకు తక్కువ పని దినాలు కల్పించి మెటీరియల్‌‌‌‌ వర్క్స్‌‌‌‌ ఎక్కువగా చేస్తే ఆ పనులకు నిధులు విడుదలయ్యే అవకాశం లేదు. ఆర్థిక సంవత్సరం ఉపాధి హామీ ద్వారా కూలీలకు రూ.1,759.33(60.2 శాతం) కోట్లు వ్యయం కాగా మెటీరియల్‌‌‌‌ పనుల కోసం రూ.1163.21(39.8 శాతం) నిధులు మజూరయ్యాయి. వాస్తవానికి సీసీ రోడ్లు, జీపీ భవనాల భవనాల నిర్మాణం తదితర మెటీరియల్‌‌‌‌ పనులు 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఇంతకంటే ఎక్కువగా జరగడంతో ఆ వర్క్స్‌‌‌‌ చేసిన మాజీ సర్పంచ్‌‌‌‌లకు ఇప్పటికీ నిధులు విడుదల కాలేదు. ఈసారి పల్లె ప్రగతి కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 12,750 గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. ఒక్కో వైకుంఠధామానికి రూ.12 లక్షల చొప్పున ఈజీఎస్‌‌‌‌ నిధులను వినియోగించాలని నిర్ణయించింది. ఈ లెక్కన ఈసారి కేవలం శ్మశానవాటికలకే రూ.వెయ్యి కోట్లు వ్యయం దాటే అవకాశముంది. ఈజీఎస్‌‌‌‌ నిధులతోనే జీపీ భవన నిర్మాణాలు, డంపింగ్‌‌‌‌ యార్డుల  నిర్మాణాలకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ లెక్కన మొత్తం మెటీరియల్‌‌‌‌ వర్క్స్‌‌‌‌కు రూ.1300 కోట్లు వ్యయం దాటనుంది

No comments:

Post a Comment