Breaking News

07/12/2019

దిశ’ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు

గవర్నర్‌ తమిళసై ని  కలిసిన కాంగ్రెస్‌ బృందం
హైదరాబాద్‌ డిసెంబర్ 7  (way2newstv.in)
‘దిశ’ కేసు విషయంలో  పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్‌ బృందం గవర్నర్‌ తమిళసై ని శనివారం కలిసింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, మద్యం అమ్మకాలను నియంత్రించాలని గవర్నర్‌కు కాంగ్రెస్‌ నేతలు విజ్ఞప్తి చేశారు. 
దిశ’ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు

అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయని, ఎక్కడ చూసిన హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విచ్చలవిడి ఆదాయాన్ని పెంచేవిధంగా కాకుండా రెగ్యులేటేడ్‌ మద్యాన్ని మాత్రమే అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రజల భద్రత కోసం వినియోగించాల్సిన పోలీసు యంత్రాంగాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు ఉపయోగించుకుంటున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు.

No comments:

Post a Comment