Breaking News

17/12/2019

యాదాద్రిలో సీఎం కేసీఆర్

యాదాద్రి భువనగిరి డిసెంబర్ 17 (way2newstv.in)
ముఖ్యమంత్రి కే సీఆర్ మంగళవారం యాదాద్రి లో పర్యటించారు. యాదాదరి ఆలయానికి చేరుకున్న సీఎం కు ఘనస్వాగతం లభించింది. మంత్రి జగదీష్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల. శేఖర్ రెడ్డి, గాదరి. కిషోర్, జడ్పి చెర్మెన్ సందీప్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణరెడ్డి, సునిత మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ అయనకు స్వాగతం పలికారు.  ఆలయం వద్దకు చేరుకున్న కేసీఆర్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 
యాదాద్రిలో సీఎం కేసీఆర్

బాలాలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు సీఎం కేసీఆర్ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తరువాత అయన యాదాద్రి ఆలయ నిర్మాణపనుల పురోగతిని సీఎం కేసీఆర్ పరిశీలించారు.  ప్రెసిడెన్షియల్ సూట్, ఇతర కాటేజ్ నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణ పనులపై అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు.  శిల్పులు తుదిమెరుగులు దిద్దుతున్న పనులను ప్రత్యక్షంగా చూసారు.

No comments:

Post a Comment