Breaking News

06/12/2019

పెట్రోల్ ధర తగ్గింది....

ముంబై, డిసెంబర్ 6 (way2newstv.in)
దేశీ ఇంధన ధరలు మిశ్రమంగా కదిలాయి. శుక్రవారం పెట్రోల్ ధర తగ్గింది. 8 పైసలు క్షీణించింది. డీజిల్ ధర మాత్రం స్థిరంగానే కొనసాగింది. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.79.66కు తగ్గింది. డీజిల్ ధర మాత్రం రూ.71.79 వద్దనే నిలకడగా కొనసాగుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి.అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 8 పైసలు తగ్గుదలతో రూ.79.22కు క్షీణించింది. డీజిల్‌ ధర మాత్రం రూ.71.09 వద్ద నిలకడగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. 
పెట్రోల్ ధర తగ్గింది....

పెట్రోల్ ధర 8 పైసలు క్షీణతతో రూ.78.85కు తగ్గింది. డీజిల్ ధర మాత్రం రూ.70.75 వద్ద నిలకడగా ఉంది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 5 పైసలు క్షీణతతో రూ.74.86కు తగ్గింది. డీజిల్ ధర మాత్రం రూ.65.78 వద్ద నిలకడగా కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 8 పైసలు తగ్గుదలతో రూ.80.51కు క్షీణించింది. డీజిల్ ధర మాత్రం రూ.69.00 వద్ద నిలకడగా కొనసాగుతోంది.అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.03 శాతం తగ్గుదలతో 63.27 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.15 శాతం క్షీణతతో 58.34 డాలర్లకు తగ్గింది.ఇకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు.

No comments:

Post a Comment