న్యూఢిల్లీ డిసెంబర్ 02 (way2newstv.in)
దిశ ఆత్యాచారం, హత్య ఘటనపై రాజ్యసభలో సోమవారం చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ . దిశ హత్య దేశం మొత్తాన్ని కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదన్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేయాలన్నారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ ఘటన, ఢిల్లీ ఘటనను తలపిస్తూ మరోసారి ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేసిందన్నారు. జీరో ఎఫ్ఐఆర్పై సుప్రీం ఆదేశాలను పాటించాలన్నారు.
దిశ ఘటనపై రాజ్యసభలో చర్చ
ఘటనకు ముందు పెట్రోలింగ్, రక్షణ చర్యలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్భయ చట్టంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సత్వర న్యాయం జరుగుతుందని భావన కలిగేలా తీర్పు ఉండాలన్నారు. అధ్యక్షపీఠంలో వున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ హైదరాబాద్ లోనే కాదు.. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని అన్నారు. సభ్యులు మాట్లాడిన అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడారు. రేపిస్టులకు క్షమాభిక్ష వుండకూడదని అన్నారు.మహిళలపై దాడులకు స్వస్తి పలకాల్సిన అవసరముందని అయన వ్యాఖ్యానించారు. కేవలం చట్టాలు చేసినంత మాత్రాన బాధితులకు న్యాయం జరగదని చెప్పారు. ఇప్పటికే ఉన్న చట్టాల్లోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
No comments:
Post a Comment