Breaking News

02/12/2019

ఆ ఇద్దరూ మరణించారు

హైదరాబాద్  డిసెంబర్ 2, (way2newstv.in)
బాలాపూర్ పోలీస్స్టేషన్ ఎదుట ఆత్మహత్యకు యత్నించిన ఏఎస్ఐ నర్సింహ సోమవరం ఉదయం మృతి చెందారు. కంచన్బాగ్లోని డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. క్రమశిక్షణ చర్యలో భాగంగా బదిలీ చేయడంతో నర్సింహ కుంగిపోయారు. సీఐ సైదులు అక్రమంగా తనపై తప్పుడు నివేదిక ఇచ్చారని ఆయనఆరోపించిన విషయం తెలిసిందే.నరసింహ ఆత్మహత్య కి కారణం అయిన కానిస్టేబుల్ పై మర్డర్ కేసు నమోదు  చేయాలని అయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేసారు. నవంబర్ 22 న బాలాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసాడు. 40 శాతం కాలిన గాయాలు తో చికిత్స పొందుతూ డీఆర్డీవో అపోలో ఆస్పత్రి లో మృతి చెందాడు. 
ఆ ఇద్దరూ మరణించారు

నరసింహ మృతి విషయం తెలిసిన తరువాత ఎల్బీ నగర్ డీసీపీ సంప్రీత్ సింగ్ అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. అయనను కలిసిన నరిసంహ బంధువులు సిఐ సైదులు ని సస్పెండ్ చేయలని డిమాండ్ చేసారు. తమపై ఎస్సీ ఎస్టీ  కేసు పెడుతా అంటూ బెదిరింపులు దిగాడని డీసీపీ కి ఫిర్యాదు చేసారు.మరోవైపు అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటనలో గాయాలపాలైన అటెండర్ చంద్రయ్య కూడా ఇదే ఆస్పతిలో సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు.  ఒక్కసారిగా మాట పడిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు వైద్యులు కృతిమ శ్వాసను అందించారు. 24గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమని డాక్టర్లు పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ పరిస్థితి విషమించడంతో చంద్రయ్య తుది శ్వాస విడిచారు. వీరి కుటుంబ సభ్యులు డీఆర్డీవో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వెంటనే మృతదేహాలను అప్పగించాలంటూ నినాదాలు చేశారు. వివాదాస్పద భూమికి సంబంధించి పట్టా ఇవ్వలేదనే కోపంతో ఎమ్మార్వోను ఒక రైతు సురేష్ సజీవ దహనం చేయగా.. ఆమెను కాపాండేందుకు ప్రయత్నించిన  అటెండర్ చంద్రయ్య, డ్రైవర్ గురునాథానికి కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. అయితే డ్రైవర్ అప్పుడే చనిపోయాడు.

No comments:

Post a Comment