Breaking News

18/12/2019

మళ్లీ ఒంటరిగా బరిలోకి టీడీపీ

నెల్లూరు, డిసెంబర్ 18, (way2newstv.in)
చంద్రబాబు రాజకీయాల్లో మరో మారు ప్రభావితం అవుతున్నారా? లేక పరిస్థితులకు అనుగుణంగా ఆయన నడచుకుంటున్నారా? అన్నది అర్ధం కావడంలేదు. చంద్రబాబు టీడీపీ ప్రెసిడెంట్ అయి పాతికేళ్ళు అవుతోంది. ఈ మధ్యలో చంద్రబాబు ఒకే ఒకసారి ఒంటరిగా పోటీ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బాబు సింగిల్ గా వస్తే సీన్ మొత్తం కాలిపోయింది. చేదు అనుభవాలే దక్కాయి. అధికారం దూరమైంది. ఇది చంద్రబాబు కంటే ఎవరికీ తెలియని విషయం కూడా కాదు. అయితే పొత్తులకు సంధి కొట్టిన కాలం కావడంతో బాబు ఈ సాహసం చేశారు. ఇపుడు మళ్ళీ చంద్రబాబు అలాంటి ప్రయోగమే చేస్తారట. ఒకసారి వికటించినా కూడా మళ్ళీ బాబు అదే రూట్లో వెళ్తున్నారు. బహుశా జగన్ ని చూసి ప్రభావితం అవుతున్నారేమో.రానున్న స్థానిక ఎన్నికల్లో పొత్తులు లేవని చంద్రబాబు తన క్యాడర్ కి క్లారిటీగా చెప్పేశారు. మనకు మనమే బరిలో నిలిచి గెలవాలి. 
మళ్లీ ఒంటరిగా బరిలోకి టీడీపీ

సత్తా చాటాలి. ఇదీ బాబు కార్యకర్తలకు ఇస్తున్న పిలుపు. ఒంటరిగా పోటీ చేసి మన దమ్ము చూపిద్దామని చంద్రబాబు అంటున్నారు. మరి బాబు డేరింగ్ గా ఇచ్చిన పిలుపు క్యాడర్ ఎంతవరకూ రిసీవ్ చేసుకుంటుందో తెలియదు కానీ బాబు మాత్రం పట్టుదలగానే ఉన్నారు. టీడీపీ అసలైన బలం క్షేత్ర స్థాయిలో ఉందని ఆయన నమ్ముతున్నారు. గట్టిగా కష్టపడితే టీడీపీకి విజయం దక్కడం ఖాయమని కూడా తమ్ముళ్ళకు నూరిపోస్తున్నారు.నిజానికి స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా టీడీపీ బరిలోకి దిగి ఒకసారి గెలిచింది. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఉమ్మడి ఏపీలో జరిగిన లోకల్ ఫైట్ లో టీడీపీ టాప్ లేపింది. ఆ హుషార్ లో మరుసటి ఏడాది వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయభేరీ మోగించింది. దాన్ని స్పూర్తిగా చూపించి చంద్రబాబు జయం మనదేనని క్యాడర్ ని రంగంలోకి దిగమంటున్నారు. అయితే అప్పట్లో జరిగిన లోకల్ బాడీ ఎన్నికలపుడు రాజకీయం వేరు గా ఉంది. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా మొదటే చేతులెత్తేసింది. ఓ వైపు సగం బలం జగన్ తీసుకుపోయారు. మరో వైపు జగన్ జైల్లో ఉన్న సమయం అది. ఇక టీడీపీకి అప్పటికి అధికారం దూరమై తొమ్మిదేళ్ళు గడచింది. అలా కసి కూడా క్యాడర్లో పెరిగి గట్టిగా పనిచేశారు.పైగా నాడు చంద్రబాబు వయసు, దూకుడు పాళ్ళు వేరుగా ఉండేవి. ఇపుడు చూస్తే అలా కాదు. జగన్ అధికారంలో ఉన్నారు. ఇక బంపర్ మెజారిటీతో గద్దెనెక్కి కొద్ది నెలలే అయింది. టీడీపీకి అపుడున్న బలమే కాదు, నైతిక స్థైర్యం కూడా ఈ రోజు లేదు. భవిష్యత్తు మీద బెంగ చాలా ఉంది. ఈ నేపధ్యంలో సింగిల్ గా వెళ్తే ఫలితాలు ఎలా ఉంటాయోనన్న కంగారు తమ్ముళ్లకు ఉంది. కానీ తప్పదు. చంద్రబాబు బింకంగా బయటకు చెబుతున్నా ఆయన‌ది అనివార్య పరిస్థితి. ఎందుకంటే బీజేపీ దూరంగా ఉంది. జనసేనతో పొత్తు అన్నా కుదురుతుందో లేదోనని డౌట్. అందుకే చంద్రబాబు సింగిల్ గానే వస్తామంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.

No comments:

Post a Comment