Breaking News

18/12/2019

భరోసాకు ఎదురుచూపులు (అనంతపురం)

అనంతపురం, డిసెంబర్ 18 (way2newstv.in):
 పీఎం కిసాన్‌-వైఎస్సార్‌ రైతు భరోసా పథకం నగదు అందక పలువురు రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. సొమ్ము తమ ఖాతాల్లో ఎప్పుడు జమ అవుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అన్ని అర్హతలుండీ.. పత్రాలన్నీ సమర్పించినా డబ్బులు ఎందుకు జమ కావడం లేదని వాపోతున్నారు. ఈ పథకానికి జిల్లాలో ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో ఇంకా 15,202 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. కొన్ని సాంకేతిక కారణాలతో నగదు జమ కావడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే రైతులు మాత్రం రోజూ ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. పీఎం కిసాన్‌- వైఎస్సార్‌ రైతు భరోసా పథకానికి జిల్లాలో ఇప్పటి వరకు 5,41,894 మంది లబ్ధిదారులను గుర్తించగా 5,26,692 మంది ఖాతాల్లో రూ.425 కోట్లు జమ అయ్యాయి. కొందరు రైతులు పొలంపై బ్యాంకుల్లో రుణాలు పొందారు. 
భరోసాకు ఎదురుచూపులు (అనంతపురం)

ఆ ఖాతాకు అప్పటికే వారి ఆధార్‌ అనుసంధానమై ఉంటుంది. అదే ఖాతా ఎన్‌పీసీఐతోనూ లింక్‌ అయి ఉంటుంది. ఆ ఖాతాలో నగదు జమ అయితే ఆ సొమ్మును బ్యాంకర్లు రుణం కింద జమ చేసుకుంటారేమో అనే ఆందోళనలో రైతులు ఉన్నారు. ఈనేపథ్యంలో పలువురు వేరే ఖాతాకు ఆధార్‌ అనుసంధానం చేయించి ఆ వివరాలను అధికారులకు అందజేశారు. కొత్త ఖాతా ఎన్‌పీసీఐతో లింక్‌ కావడానికి 10 నుంచి 15 రోజలు సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అప్పటికే ఎన్‌పీసీఐ దగ్గర రైతు ఆధార్‌తో లింక్‌ అయిన వేరే ఖాతా ఉంది. అది డీలింక్‌ కాలేదు. ఇలా ఒక రైతుకు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఎన్‌పీసీఐ దగ్గర ఉండటంతో నగదు విడుదల చేసినా ఏ ఖాతాకూ జమ కావడం లేదు. రైతులు బ్యాంకుకు వెళ్లి ఆధార్‌ వివరాలు, ఎన్‌పీసీఐ వివరాలు సరి చేయించుకుంటే వెంటనే నగదు జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు. పథకానికి లబ్ధిదారులుగా ఎంపికైనా ఇప్పటికీ నగదు జమకాని రైతుల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు మండలాల వారీగా గుర్తించారు. ఆయా మండలాల పరిధిలో అధికారులు నేరుగా సదరు రైతులతో మాట్లాడి సమస్యను వివరిస్తున్నారు. పరిష్కారానికి అవసరమైన సూచనలు చేస్తున్నారు

No comments:

Post a Comment