Breaking News

17/12/2019

బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావుపై పోలీసుల కేసు

హైదరాబాద్‌ డిసెంబర్ 17 (way2newstv.in)
బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావుపై ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అచ్యుతరావు రహదారి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని మధురా నగర్‌ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సాంబశివరావు ఫిర్యాదు మేరకు అచ్యుతరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. 1997 నుంచి మధురానగర్‌లో లింక్‌ రోడ్డు నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావుపై పోలీసుల కేసు

స్టేట్‌ హోం మీదుగా లింక్‌ రోడ్డు నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ అంగీకారం తెలిపింది. స్టేట్‌ హోమ్‌ భూమి అప్పగించే విషయంలో అచ్యుతరావు రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు అచ్యుతరావు డిమాండ్‌ చేసినట్లు సాంబశివరావు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే కొంత డబ్బు ఇచ్చినట్లు మధురానగర్‌ సొసైటీ కార్యదర్శి కూడా ఫిర్యాదు చేశారు. సాంబశివరావు ఫిర్యాదు మేరకు అచ్యుతరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అచ్యుతరావుపై 384, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

No comments:

Post a Comment