హైద్రాబాద్, డిసెంబర్ 16, (way2newstv.in)
ఇంట్లోకి అడుగు పెట్టగానే మొదట చూపుని ఆకర్షించేది వాల్ పెయింటింగ్స్, ఫొటోస్. ఇప్పుడు ట్రెండ్ మారింది. వాటి స్థా నంలోకి డిఫరెంట్.. డిఫరెంట్ టైల్స్ వచ్చేశాయి. కొత్తగా కట్టే ఇల్లయినా, ఆఫీస్ స్పేస్ అయినా ప్రస్తుతం అందులో వాడే టైల్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మార్కె ట్ లో దేశీయ బ్రాండ్స్ తో పాటు,విదేశీ బ్రాండ్స్ లో టైల్స్ కనువిందు చేస్తున్నాయి.డిజైనర్ టైల్స్, ట్రెడిషనల్ టైల్స్, ఇంపోర్టెడ్ టైల్స్స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి.కనువిందు చేసేలా..కస్టమర్ల అభిరుచికి తగినట్టుగా ఇండియన్ టైల్స్ తో పాటు ఇంపోర్టెడ్ టైల్స్ తెప్పిస్తున్నారు వ్యాపారులు. స్పెయిన్, ఇటలీ, చైనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. డిజైనర్ టైల్స్, ఎగ్జో టిక్ డిజైనర్ టైల్స్, హ్యాండ్ మేడ్ టైల్స్, టైల్ ఆన్ టైల్, సిరామిక్ మెటీరియల్ ని వాడుతూ డిఫరెంట్ మోడల్స్ ని రూపొందిస్తున్నారు.
స్టేటస్ కు తగ్గట్టుగా కొత్త టైల్స్
ఇండింపెం డెంట్ బంగ్లాలలోఇంటీరియర్ కి తగినట్టుగా ఒకప్పుడు లగ్జరీ సెగ్మెంట్ లో హై ఎండ్ టైల్స్ ఉండేవి. ఫ్లోర్ లో, టాయిలెట్ వాల్ కి డిజైనర్ టైల్, రెగ్యులర్ ఫ్లోర్ లో మెటాలిక్ ఇన్ సర్స్ట్ టైల్స్ బయట ప్రాంతాలకు వెళ్లి తెచ్చేవారు. ప్రస్తుతం సిటీ మార్కె ట్ లో అందుబాటులోకి వచ్చేశాయి. పింటెరెస్ట్ లో ఉండే కలర్స్, డిజైన్స్ అన్నీ ఇప్పుడు టైల్స్ పై చేస్తున్నారు. డిజైనర్ టేస్ట్, క్లైంట్ టేస్ట్ కి అనుగుణంగా కలర్ కాంబినేషన్స్ లో టైల్స్ కనువిందు చేస్తున్నాయి. ఇటలీ, స్పెయిన్ నుంచి వచ్చే గ్లాజ్ మోజాయిక్ టైల్, సిరామిక్ మోజాయిక్ టైల్ విత్ గోల్డ్ ఎంబెడెడ్, సిల్వర్ ఎంబెడెడ్, కాపర్,మెటాలిక్ ఫినిష్ లో టైల్స్ ఆకట్టుకుంటున్నాయి. టైల్ ని కూడా ఒక బ్యూటీఫుల్ ఆర్ట్ లా మారుస్తున్నారు. ఆర్కి టెక్ట్ డిజైనర్లతో, ఇంటీరియర్ స్పెషల్ డిజైనర్ లతో టైల్ పై అందమైన చిత్రాలను వేపిస్తున్నారు.ముఖ్యంగా సిరామిక్ టైల్స్ పై ఎంతో అద్భుతంగా నెమలిని, మురళి చేతిలోపట్టుకున్న కృష్ణుడిని, కృష్ణుడు గోపికల చిత్రాన్ని , పూలు, ప్రకృతి సోయగాలు, దేవుడి ప్రతిమలను ఆర్ట్ రూపంలో మలుస్తున్నారు.నాలుగైదేళ్ల నుంచి నాలుగైదు ఏళ్ల నుంచి కస్టమర్ల అభిరుచిలో మార్పు వస్తోంది. డిజైనర్ టైల్స్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇంటీరియర్ కి, టైల్స్ కి ఎంత కాస్ట్ అయినా పెట్టేందుకు వెనుకాడడం లేదు. స్పెషల్ గా కనిపించేందుకు డిజైనర్ టైల్స్ మధ్యలో వాడుతున్నారు. కలర్ కాంబినేషన్ థీమ్ లో టైల్స్ తయారు చేస్తున్నారు. సిరామిక్ టైల్స్, డబుల్ చార్జ్ టైల్స్, గూడ్స్ థీమ్ టైల్స్ ఈ మెటీరియల్స్ పైన డిజైనర్ వర్క్ చేసి అందిస్తారు. వీటిలో ట్రెడిషనల్ టైల్స్ కూడా ఉంటాయి. వాటిలో చిట్టినాడ్ హత్తంగిడి టైల్స్, బాంబే కి చెందిన భారత్ టైల్స్ ని ట్రెడిషనల్ టైల్స్అంటారు. వీటిపై కలర్ ఫుల్ ఫొటోలతో చేస్తారు. హత్తంగిడిలో టెర్రకోటతో చిత్రాలను వేస్తారు.మార్కె ట్లో ఇండియన్ టైల్స్ నార్మల్ టైల్ రూ.60 నుం చి రూ.400లకు, ఇంపోర్టెడ్ లో డిజైన్ నిబట్టి రూ.లక్ష విలువ చేసే టైల్స్ ఉన్నాయి. వీటిని ఆర్డర్ పై తెప్పిస్తారు. ట్రెడిషనల్ టైల్స్ రూ.250 స్కెయి ర్ ఫీట్ నుం చి, రూ.400 స్కెయి ర్ ఫీట్ వరకు ఉంటుంది. గ్లాజ్ మోజానిక్స్ లో 1/1,2/2 ఇంచెస్ తో చిన్నచిన్న కలర్ క్యూ బిక్స్ చేసి వాటన్నింటి ని జాయింట్ చేసి వాల్ టైల్స్ చేస్తారు. ఇందులో ఫేస్, ఆర్స్ట్ వేసుకోవచ్చు.స్టేటస్ కు తగ్గట్టు డిమాండ్ ఒకప్పుడు నార్మల్ టైల్స్ మాత్రమే ఉండేవి. అవి కూడా 2, 3 డిజైన్లలోనే ఉండేవి. ప్రస్తు తం ఇండియన్ టైల్స్లో 10–12, ఇంపో ర్టెడ్ టైల్స్ లో 12- 15 కంపెనీలకు చెందిన వెరైటీలు అందుబాటులో ఉంటున్నాయి. ప్లెయిన్ టైల్స్ నుంచి ఎగ్జోటిక్డిజైనర్ టైల్స్ కు డిమాండ్ బాగుంది. స్టేటస్ కి, రూమ్ ఆంబియన్స్ కి తగినట్టు క్లైంట్స్ లైక్ చేస్తున్నారు
No comments:
Post a Comment