Breaking News

16/12/2019

మేడారం కాంట్రాక్టర్లకు కాసులే..కాసులు

వరంగల్, డిసెంబర్ 16, (way2newstv.in)
సమ్మక్క సారలమ్మ మహా జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రెండేళ్లకోసారి రూ.కోట్ల నిధులు విడుదల చేస్తోంది. జాతర దగ్గరకొచ్చే సమయంలో తూతూ మంత్రంగా పనులు జరిపి అటు కాంట్రాక్టర్లు.. ఇటు అధికారులు జేబులు నింపుకోవడానికే సరిపోతోంది. రెండేళ్లు గడిచేసరికి మళ్లీ పనులు.. నిధులు.. ఇదీ అసలు సంగతి. జిల్లాల పునర్విభజన జరిగింది. కలెక్టర్లు మారారు.. అయినా ఇదే తరహా పనులు.. ఏం మారలేదు. ఈసారి కూడా 2020 ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు జరిగే మేడారం మహా జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు విడుదల చేసింది. వివిధ ప్రభుత్వ శాఖలు రూ.47 కోట్లతో పనులు చేపట్టాయి. ఆర్డబ్ల్యూఎస్ శాఖ అత్యధికంగా రూ.16.7 కోట్లతో పనులు నిర్వహిస్తుండగా వీటిలో రూ.2.07 కోట్లతో 8 లక్షల లీటర్ల సామర్థ్యం గల 3 వాటర్ ట్యాంకులను నిర్మిస్తున్నారు. 
మేడారం కాంట్రాక్టర్లకు కాసులే..కాసులు

ఊరట్టం, మేడారంలో 2 లక్షల లీటర్లు, జంపన్నవాగు సమీపంలో 4 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగిన వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులను ఇటీవల అధికారులు ప్రారంభించారు. జాతర వరకు పనులు పూర్తిచేసి భక్తులకు నీళ్లందించాలని లక్ష్యం పెట్టుకున్నారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ తక్కువ సమయం ఉండటంతో సిమెంట్ పనులకు క్యూరింగ్ చేయడం లేదు. కొటేషనల్లో ఇచ్చిన సిమెంట్కు బదులు మాములు కంపెనీల సిమెంట్ను వినియోగిస్తున్నారు. అయినా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడం లేదు.తాడ్వాయి నుంచి నార్లాపూర్ వరకు రూ.1.20 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్ గుంతలను పూడ్చి కంకర వేసి క్యూరింగ్ చేయకుండా వదిలేశారు.బీటీ కూడా వేయలేదు. దీంతో కేవలం రెండు రోజులకే కంకర పైకి తేలింది. అలాగే కల్వర్టులను కూడా సీసీతో బదులు మట్టితో నిర్మించి చేతులు దులుపుకుంటున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.మేడారం గద్దెలకు సమీపంలో వేసిన బీటీ రోడ్ల అభివృద్ధి పనులు కూడా తూతూమంత్రంగా చేసి వదిలేశారు. గద్దెల దగ్గర ఉపయోగించే నీరు బయటికి వెళ్లడానికి నిర్మించిన సైడు కాలువ పూర్తిగా మట్టితో కూడుకుపోయింది. అయినా దాని మరమ్మతులు చేపట్టనేలేదు.మేడారం జాతరలో జంపన్నవాగుకు ప్రత్యేక స్థానం ఉంది. జాతరకు వచ్చే ప్రతి భక్తుడు ఈ వాగులో స్నానం చేసి అమ్మవార్లను దర్శించుకోవడానికి వెళతారు. జాతర సమయంలో మోకాలు లోతు నీటిని నిల్వ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జంపన్నవాగులో మూడు చోట్ల రూ.12 కోట్లతో 3 చెక్డ్యాంలు నిర్మించింది. రెడ్డిగూడెం నుంచి ఊరట్టం వైపు వీటిని నిర్మించారు. కేవలం 2 కి.మీ దూరంలోనే మూడు చెక్డ్యాంల నిర్మాణం చేశారు. గత వేసవిలో పనులు జరిపారు. పనులు పూర్తయ్యి ఏడాది పూర్తికాకముందే రూ.4 కోట్ల విలువ చేసే చెక్డ్యాం ఒకటి కొట్టుకుపోయింది.  కొట్టుకుపోయిన చెక్డ్యాంను మరమ్మతు చేయాలని, జంపన్నవాగులో వరదనీరు కేవలం మోకాలులోతే మాత్రమే ఉండేలా ఇసుకను సమాంతరంగా చేయాలని ఐబీ శాఖ అధికారులను రాష్ట్ర మంత్రి సత్యవతిరాథోడ్, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి నెల రోజుల క్రితమే ఆదేశించారు. అయినా ఐబీ శాఖ అధికారుల నుంచి రెస్పాన్సే లేదు.చత్తీస్గఢ్, మహారాష్ట్ర భక్తులు అధికసంఖ్యలో వచ్చే ఊరట్టం‒కొండాయి రోడ్డు అభివృద్ధి పనులు రెండేళ్లుగా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ జాతర సమయానికి కూడా పూర్తయ్యేలా కన్పించడం లేదు.

No comments:

Post a Comment